Begin typing your search above and press return to search.

కొత్త పెళ్లి కొడుకు ఇబ్బంది ప‌డ‌కుండా ఇంటిప‌క్క‌నే!

ప్ర‌స్తుతం అఖిల్ హీరోగా లెనిన్ చిత్రం తె ర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ షూటింగ్ కూడా అన్న‌పూర్ణ స్టూడియో లోనే జ‌ర‌గ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   2 July 2025 4:00 AM IST
కొత్త పెళ్లి కొడుకు ఇబ్బంది ప‌డ‌కుండా ఇంటిప‌క్క‌నే!
X

ఇటీవ‌లే అక్కినేని అఖిల్ ధాంప‌త్య జీవితంలో కి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన జైన‌బ్ ర‌వ్జీని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడ‌య్యాడు. వివాహం ఎంతో నిరాడంబ‌రంగా జ‌రిగింది. అక్కి నేని కుటుంబం త‌మ ఇంట్లోనే వివాహం జ‌రిపించింది. అటుపై అఖిల్-జైన‌బ్ దంప‌తులు కొన్ని రోజుల పాటు హ‌నీమూన్ కి వెళ్లి తిరిగొచ్చారు. అనంత‌రం అఖిల్ పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండాని సినిమా షూటింగ్ షురూ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అఖిల్ హీరోగా లెనిన్ చిత్రం తె ర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ షూటింగ్ కూడా అన్న‌పూర్ణ స్టూడియో లోనే జ‌ర‌గ‌డం విశేషం. అఖిల్ విదేశాల నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత పెద్దగా మ‌రోచోట‌కి ప్ర‌యాణం చేయ‌కుండానే సొంత‌ స్టూడియోలోనే షూటింగ్ జ‌ర‌గ‌డంతో హాజ‌ర‌వుతున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కొంత భాగం పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే పెళ్లికి ముహూర్తం పెట్ట‌డంతో కొన్ని రోజుల‌గా ఆ ప‌నుల్లోనే ప‌డిపోయాడు.

దీంతో `లెనిన్` షూటింగ్ అకిల్ ఏకుండా జ‌రుగుతుంది.ఈ స‌మ‌యంలో అఖిల్ లేని స‌న్నివేశాలు చిత్రీక రించారు. తాజా షెడ్యూల్ లో అఖిల్ పాల్గొన‌డంతో షూటింగ్ వేగం పుంజుకుంది. వీలైనంత త్వ‌ర‌గా ఈ షెడ్యూల్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు. అటుపై విదేశాల్లో కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉందిట‌. దానికి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని ముర‌ళీ కిషోర్ అబ్బూరు తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా అనంత‌రం అఖిల్ మ‌రో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు సమాచారం. ఓ స్టార్ డైరెక్ట‌ర్ నే రంగంలోకి దించుతున్న‌ట్లు అక్కినేని కాంపౌండ్ వ‌ర్గాల నుంచి లీకైంది. పెళ్లైన నేప‌థ్యంలో ఆ సెంటిమెంట్ కూడా క‌లిసొస్తుంద‌ని అకిల్ కాన్పిడెంట్ గా ముందుకెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.