వివాహంతో అఖిల్ కెరీర్ మారబోతుందా?
ఇటీవలే అక్కినేని వారసుడు అఖిల్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 5:00 AM ISTఇటీవలే అక్కినేని వారసుడు అఖిల్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన జైనబ్ రవ్జీని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసాడు. మరి ధాంపత్య జీవితం అఖిల్ కెరీర్ ని మార్చే అవకాశం ఉందా? బ్యాచిలర్ లైఫ్ కంటే మ్యారీడ్ లైఫ్ అతడి వృత్తిగత జీవితాన్ని ట్రాక్ లో పెట్టే అవకాశం ఉందా? అంటే అవుననే అనాలి.
'అఖిల్' అనే చిత్రంతో హీరోగా లాంచ్ అయిన అఖిల్ కు తొలి చిత్రం తేడా కొట్టింది. అక్కినేని వారసుడు గ్రాండ్ గా లాంచ్ అయిన అంచనాలు అందుకోలేకపోయాడు. అటుపై నటించిన హలో యావరేజ్ గా ఆడింది. మిస్టర్ మజ్ను ప్లాప్ అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మాత్రం అఖిల్ ప్లాప్ ల బారి నుంచి బయట పడేసింది. ఆ సినిమా మంచి ఫలితాలే సాధించింది. కానీ అక్కినేని ఫ్యామిలీ రేంజ్ హిట్ కాదది.
దీంతో 'ఏంజెట్' కోసం అఖిల్ చాలా శ్రమపడ్డాడు. సిక్స్ ప్యాక్ లుక్...భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన చిత్రమిది. కట్ చేస్తే అన్ని సినిమాల కంటే దారుణమైన ఫలితాన్ని అందించింది. ఇలా నటించిన ఐదు సినిమాల్లో రెండు మాత్రమే ఊరటనిచ్చాయి. ఇదంతా అఖిల్ పెళ్లికి ముందు జరిగింది. అంటే అఖిల్ కెరీర్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఇలా ముగిసింది. సెకెండ్ ఇన్నింగ్స్ జైనబ్ రవ్జీ జీవితంలోకి రావడంతో మొద లైంది.
జీవిత భాగస్వామి రాకతో కెరీర్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయంటారు. పాజిటివ్ కోణంలో చూస్తే జీవితం మరింత గొప్పగా ప్రశాంతంగా, సక్సెస్ పుల్ గా ఉంటుందని పెద్దలు చెప్పే మాట. ఆ ప్రకారం చూస్తే అఖిల్ ప్రోపెషనల్ కెరీర్ కి వివాహం కలిసి రావాలి. వివాహం అనంతరం రిలీజ్ అయ్యే తొలి సినిమా 'లెనిన్' . ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
