అఖిల్ ఇప్పటికి తెలుసుకున్నాడా?
టాలీవుడ్ స్టార్ హీరోల వారసుల్లో రేసులో ఇప్పటికీ వెనబడిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో అక్కినేని హీరోలు మాత్రం ముందు వరుసలో వున్నారు.
By: Ravindar Gorantla | 1 July 2026 4:00 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోల వారసుల్లో రేసులో ఇప్పటికీ వెనబడిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో అక్కినేని హీరోలు మాత్రం ముందు వరుసలో వున్నారు. స్టార్ గా కింగ్ నాగార్జున లెగసీని కంటిన్యూ చేయడంలో ఏళ్ల తరబడి తడబడుతూనే ఉన్నారు. కొంత వరకు నాగచైతన్య ఫరవాలేదు అనిపించుకుంటున్నా.. అనుకున్న స్థాయి స్టార్ డమ్‌ని మాత్రం ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోతున్నాడు.
కార్తీక్ దండు తీస్తున్న 'వృషకర్మ'తో ఆ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తాడో వేచి చూడాల్సిందే. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేయడం, నాగాచైతన్య క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉండటంతో అక్కినేని అభిమానుల్లో 'వృశకర్మ'పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే అక్కినేని అఖిల్ గురించి మాత్రం ఫ్యాన్స్, నాగార్జున గత కొన్నేళ్లుగా వర్రీ అవుతూనే ఉన్నారు.
ఫస్ట్ మూవీ నుంచి అఖిల్ స్టార్ కిడ్ తరహాలో వచ్చింది.. డైరెక్టర్ చెప్పాడు.. చేసేశాం. ఇది పక్కా బ్లాక్ బస్టర్ అన్న విధంగా చేసుకుంటూ వచ్చాడు. కానీ `ఏజెంట్` తో భారీ డిజాస్టర్ ఎదుర్కోవడం.. కెరీర్ ఇక ఇంతేనా అనే సందేహాలు సర్వత్రా తలెత్తడంతో ఆలోచించడం మొదలు పెట్టినట్టున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా చేసే సినిమాలో నటించడం పక్కన పెట్టి ప్రాణం పెట్టడమే కాకుండా క్యారెక్టర్‌లో జీవించాలని నేర్చుకున్నట్టుగా `లెనిల్` ట్రైలర్ లో కనిపిస్తోంది.
అంతే కాకుండా ఆహార్యం, డైలాగ్ డెలివరీ, హావ భావాల విషయంలోనూ జాగ్రత్త తీసుకోవడంతో `లెనిన్`లో మునుపటి అఖిల్ కనిపించడం లేదు. కేవలం తన పాత్ర మాత్రమే కనిపిస్తోంది. దీంతో అక్కినేని అభిమానులతో పాటు సినీ లవర్స్ అఖిల్ కి ఇప్పటికి తత్వం బోభపడిందని, తను ఇప్పటికి తెలుసుకున్నాడని కామెంట్‌లు చేస్తున్నారు. అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `లెనిన్`. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
గత కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఫైనల్‌గా ఈ నెల 10న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించడం, అందులో అఖిల్ కనిపించకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించడంతో ఇది కదా కావాల్సింది.. ఇలా కదా చేయాల్సింది. ఇన్నాళ్లకు అఖిల్ నిజం తెలుసుకున్నాడని అభిమానులే కామెంట్‌లు చేస్తున్నారు. మరి జూలై 10న రిలీజ్ అవుతున్న `లెనిన్`తో అనుకున్నట్టే అఖిల్ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
