అఖిల్ 'లెనిన్'.. రంగంలోకి స్టార్ యాక్టర్స్..
లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో లెనిన్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 April 2025 5:43 AMటాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. ఇప్పుడు లెనిన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తుండగా.. నాగార్జున, నాగవంశీ రూపొందిస్తున్నారు. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే ట్యాగ్ లైన్ తో రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకుంది.
లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో లెనిన్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. సినిమాలో అఖిల్ రోల్ నేపథ్యం ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని సమాచారం. నుదుటన బొట్టు.. పెరిగిన గడ్డం.. దేవుడి బొమ్మతో మెడలో గొలుసు.. ఇలా అఖిల్ రోల్ సినిమాలో విభిన్నంగా ఉంటుందని అర్థమవుతోంది.
ముఖ్యంగా అఖిల్ రోల్ .. తన కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా క్యారెక్టరైజేషన్ తో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్ లో భారతంలో అర్జునుడిలా పరిచయం చేసిన తీరు.. మాస్ లుక్ లో అఖిల్ కనిపించిన విధానం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా లెనిన్ ముస్తాబవుతున్నట్లు అర్థమవుతోంది.
అయితే లెనిన్ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ నటి ఈశ్వరీరావు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు శివాజీ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన కోర్టు మూవీలో మంగపతిగా ఆడియన్స్ ను ఆయన ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
అదే సమయంలో ఇప్పటి వరకు లెనిన్ మూవీ షూటింగ్ 30 శాతం పూర్తయిందని సమాచారం. కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. గ్రాండ్ గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని వినికిడి.
ఇక సినిమా విషయానికొస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. గ్లింప్స్ ద్వారా ఇప్పటికే రివీల్ అయిన విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందుతున్న లెనిన్ కు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నవీన్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.