పెళ్లి తర్వాత అఖిల్ తిరుపతి నుంచా?
అక్కినేని వారసుడు అఖిల్ ఇటీవలే ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన జైనబ్ రవ్జీని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు.
By: Tupaki Desk | 17 Jun 2025 3:00 PM ISTఅక్కినేని వారసుడు అఖిల్ ఇటీవలే ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన జైనబ్ రవ్జీని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు. గత ఏడాది నిశ్చితార్ధం అనంతరం ఇరు కుటుంబాలు ఏడాది పాటు వెయిట్ చేసాయి. ఈ సమయంలో ఒకర్ని ఒకరు అర్దం చేసుకున్న తర్వాత జరిగిన వివాహం ఇది. ప్రస్తుతం అఖిల్ ఇంకా హైదరాబాద్ లో నే ఉన్నాడు.
హనీమూన్ కి ఏదేశానికి వెళ్తున్నాడు? అన్నది సస్పెన్స్. అయితే తన సినిమా షూటింగ్ మాత్రం తిరుపతి నుంచే తర్వాత షెడ్యూల్ మొదలవుతుంది? అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో 'లెనిన్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది.
దాదాపు మేజర్ పార్టు పూర్తయినట్లు తెలుస్తోంది. చిత్రీకరణ అంతా స్థానికంగానే జరిగింది. విదేశాలంటూ ఎక్కడికి వెళ్లలేదు. స్టోరీ డిమాండ్ చేయకపోవడంతో వాస్తవ లోకషన్లు..అవసరం మేర సెట్లు వేసి పూర్తి చేసారు. అయితే తర్వాత షెడ్యూల్ మాత్రం తిరుపతిలో ప్రారంభమవుతుందని సమాచారం. తిరుపతి లోని ప్రత్యేకించి కొన్ని ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని అక్కడే చిత్రీకరించనున్నారట.
రాయలసీమ నేపథ్యం గల కథ కావడంతోనే మరోసారి తిరుపతి లోకేషన్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అఖిల్ కి ఎంతో కీలకం. ఇప్పటికే వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఉన్న మార్కెట్ కూడా డౌన్ అవుతుంది. మరి కొత్తగా పెళ్లైన నేపథ్యంలో ఆ సెంటిమెంట్ ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి
