అఖిల్ 'లెనిన్' స్టోరీ నేపథ్యం ఇదేనా?
అక్కినేని హీరోల్లో మూడవ తరం నాయకుడు అఖిల్. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అఖిల్‌కు రావాల్సిన సక్సెస్ రాలేదు.
By: Tupaki Desk | 19 Jun 2025 4:00 AM ISTఅక్కినేని హీరోల్లో మూడవ తరం నాయకుడు అఖిల్. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అఖిల్‌కు రావాల్సిన సక్సెస్ రాలేదు. దక్కాల్సిన సినిమాలు దక్కలేదు. ఒక్క కమర్షియల్ హిట్టు పడితే తన కెరీర్‌కు ఇక తిరుగే ఉండదని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అఖిల్ ఐదు సినిమాలు చేశాడు. కానీ ఏదీ ఆశించిన స్థాయి కమర్షియల్ సక్సెస్‌ని అందించలేకపోయింది.
దీంతో అఖిల్ `లెనిన్`పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. రీసెంట్‌గా పెళ్లి కూడా కావడంతో ఇదే సమయంలో మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే అఖిల్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుంది. పెళ్లితో వ్యక్తిగత జీవితం సెటిలైంది. ఒక్క బ్లాక్ బస్టర్ పడి కెరీర్ ఊపందుకుంటే వృత్తిపరమైన జీవితం కూడా పట్టాలెక్కినట్టే. అందుకే అఖిల్ `లెనిన్`పై భారీ అంచనాలే పెట్టుకున్నాడట. కిరణ్ అబ్బవరంతో `వినరో భాగ్యము విష్ణుకథ` మూవీని డైరెక్ట్ చేసిన మురళీ కిషోర్ అబ్బూరు `లెనిన్`ని రూపొందిస్తున్నాడు.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సారి ఎలాగైనా అఖిల్‌కు హిట్టివ్వాలని నాగార్జున రంగంలోకి దిగి సూర్యదేవర నాగవంశీతో కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ టీమ్ గ్లింప్స్‌ని విడుదల చేసింది. అయితే గ్లింప్స్‌లో కథేంటన్నది ఎక్కడా రివీల్ చేయలేదు. కాకపోతే అఖిల్ క్యారెక్టర్ మేకోవర్‌తో సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేశారు.
అయితే తాజాగా ఈ మూవీ నేపథ్యంకు సంబంధించిన ఓ వార్త బయటికొచ్చింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీ పరువు హత్యల నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా ఓ ఆలయానికి సంబంధించిన కథ కూడా ఇందులో కీలకమని తెలిసింది. ఇక ఇంత వరకు పరువు హత్యలపై వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరపైకి తీసుకొస్తున్నారట. రాయలసీమ యాసలో సాగే ఈ సినిమాలో అఖిల్ ఆ యాసతో చెప్పే డైలాగ్‌లు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.
