Begin typing your search above and press return to search.

లక్కీ డేట్ తో లెనిన్.. పరిస్థితి ఎలా ఉందంటే..

అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా సార్లు ట్విస్ట్ ఇచ్చింది. ఇక మొత్తానికి జూన్ 26 నుంచి జూలై 10వ తేదీకి షిఫ్ట్ అయ్యింది.

By:  M Prashanth   |   15 Jun 2026 11:41 AM IST
లక్కీ డేట్ తో లెనిన్.. పరిస్థితి ఎలా ఉందంటే..
X

అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా సార్లు ట్విస్ట్ ఇచ్చింది. ఇక మొత్తానికి జూన్ 26 నుంచి జూలై 10వ తేదీకి షిఫ్ట్ అయ్యింది. ఈ వాయిదా గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ కొత్త డేట్ వల్ల అఖిల్ కు కలిగే లాభనష్టాలు ఏంటనే యాంగిల్ లో ఆలోచిస్తే కొన్ని బెస్ట్ పాయింట్స్ బయటపడతాయి. పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు ఈ కొత్త రిలీజ్ డేట్ ఒక రకంగా సేఫ్ జోన్ అనే చెప్పాలి.





జూలై 10వ తేదీకి టాలీవుడ్ హిస్టరీలో ఒక సాలిడ్ వైబ్ ఉంది. సరిగ్గా ఇదే రోజున దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అదే లక్కీ డేట్ ను అఖిల్ తన సినిమా కోసం లాక్ చేసుకోవడం ఫ్యాన్స్ కు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తోంది. సెంటిమెంట్ పరంగా చూసుకున్నా ఒక భారీ సక్సెస్ వచ్చిన డేట్ ను ఎంచుకోవడం ఒక మంచి డెసిషన్.

రాబోయే రిలీజ్ క్యాలెండర్ గమనిస్తే ఈ కొత్త డేట్ చుట్టుపక్కల అఖిల్ కు పెద్దగా పోటీ ఏమీ లేదు. జూలై 9న శ్రీనివాస మంగాపురం సినిమా ఉంది. ఆ తర్వాత జూలై 24 వరకు వేరే భారీ సినిమాలు ఏవీ రావడం లేదు. కంటెంట్ గనక ప్రేక్షకులకు నచ్చితే బాక్సాఫీస్ దగ్గర లాభాలు అందేలా అఖిల్ కు ఏకంగా రెండు వారాల పాటు సోలో రన్ దొరికే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్ పరంగా ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్.

ఇప్పటికే లెనిన్ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ యూత్ ను ఎట్రాక్ట్ చేశాయి. అఖిల్ లుక్, ఆ మాస్ గెటప్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే గత సినిమాల రిజల్ట్స్ చూసుకుంటే కేవలం ఈ ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే సినిమాను గట్టెక్కించడానికి ఏమాత్రం సరిపోదు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా కథలో ఒక బలమైన సోల్ ఉండాలి. అప్పుడే జనాలను థియేటర్లకు రప్పించొచ్చు.

దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరుకు ఇది రెండో సినిమా మాత్రమే. మొదటి సినిమాతో ఒక డీసెంట్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మాస్ స్టోరీని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఇక్కడ చాలా కీలకం. ఈ వాయిదా గ్యాప్ లో మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుని సినిమా ఫైనల్ అవుట్ పుట్ ను మరింత పర్ఫెక్ట్ గా రెడీ చేసుకునే స్పేస్ మేకర్స్ కు దొరికింది.

ఇక జూలై 10వ తేదీ అఖిల్ కు ఒక బెస్ట్ ఛాన్స్ లాంటిది. సోలో రిలీజ్ దొరికింది కదా అని రిలాక్స్ అవ్వకుండా ప్రమోషన్స్ డోస్ ఇంకా పెంచితే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. బాహుబలి వచ్చిన బ్లాక్ బస్టర్ రోజున బరిలోకి దిగుతున్న అఖిల్ ఈ డ్రామాతో ఎలాంటి రిజల్ట్ రాబడతాడో చూడాలి. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ లక్కీ డేట్ అఖిల్ కెరీర్ కు ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.