'లెనిన్' క్లైమాక్స్ కోసం సంథింగ్ స్సెషల్
అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా కొత్త దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
By: Tupaki Desk | 21 May 2025 4:15 PM ISTఅఖిల్ అక్కినేని ఈ పసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్‌ని దక్కించుకోవాలే కసితో ఉన్నాడు. సురేందర్‌రెడ్డితో చేసిన 'ఏజెంట్' అత్యంత డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. రూ.85 కోట్లతో నిర్మించిన ఈ మూవీ కేవలం రూ.8.5 కోట్లని మాత్రమే రాబట్టి మేకర్స్‌కు తీవ్ర నిరాశకు సాక్ ఇచ్చింది. ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్న అఖిల్ డిజాస్టర్ అని తేలడంతో తీవ్ర ఆవేదనకు గురై దుబాయ్ వెళ్లిపోవడం తెలిసిందే. కొంత విరామం తరువాత కొత్త ప్రాజెక్ట్‌ని అఖిల్ ప్రకటించడం తెలిసిందే.
అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా కొత్త దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ గ్లింప్స్‌ని ఇటీవల హీరో అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. అఖిల్ సరికొత్త మేకోవర్‌తో రగ్గ్‌డ్ లుక్‌తో కనిపించిన 'లెనిన్' గ్లింప్స్ అక్కినేని అభిమానులతో పాటు సినీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది.
ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తుండటంతో ఈ మూవీ క్లైమాక్స్‌ని మరింత స్పెషల్‌గా మలుస్తున్నారట. జూన్ ఫస్ట్ వీక్‌లో క్లైమాక్స్ షూట్‌ని మొదలు పెట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇందు కోసం ప్రత్యేకమైన స్టంట్స్‌ని డిజైన్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అయితే ఈ స్టంట్ సీక్వెన్స్ ని మరింత పర్‌ఫెక్ట్‌గా స్క్రీన్‌పై రావడం కోసం అఖిల్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారట.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చయేసి థియేటర్లలోకి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుఎన్నారు. అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి అఖిల్ సరైన కంటెంట్‌తో అక్కినేని హీరోల రెగ్యులర్ సినిమాలకు పూర్తి భిన్నమైన కథ, కథనాలతో వస్తున్నాడని సంబరపడుతున్నారు. వారి సంబరాలకు తగ్గట్టే `లెనిన్`తో అఖిల్ సక్సెస్ బాటపడతాడేమో చూడాలి.
