Begin typing your search above and press return to search.

నాగార్జున తీసుకున్న రిస్క్ ఫలించిన‌ట్టే!

అక్కినేని అఖిల్ కెరీర్ గురించి మాట్లాడిన ప్రతిసారీ కెపాసిటీ ఉంది.. కానీ సరైన సినిమా పడలేద‌నే అభిప్రాయం తరచూ వినిపించేది.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 July 2026 12:53 PM IST
నాగార్జున తీసుకున్న రిస్క్ ఫలించిన‌ట్టే!
X

అక్కినేని అఖిల్ కెరీర్ గురించి మాట్లాడిన ప్రతిసారీ కెపాసిటీ ఉంది.. కానీ సరైన సినిమా పడలేద‌నే అభిప్రాయం తరచూ వినిపించేది. యాక్ట‌ర్ గా తనలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిరూపించుకునే అవకాశాన్ని వెతుకుతున్న అఖిల్‌కు లెనిన్ సినిమా ఆ లోటును భర్తీ చేసిన సినిమాగా కనిపిస్తోంది. కేవలం బాక్సాఫీస్ స‌క్సెసే కాదు, ఆయనపై ఆడియ‌న్స్ లో ఉన్న ఇమేజ్‌ను మార్చడంలో కూడా ఈ సినిమా కీలక పాత్ర పోషించినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొద‌టి సినిమా నుంచి ఎక్కువగా స్టైలిష్, రొమాంటిక్ లేదా క్లాస్ హీరోగా కనిపించిన అఖిల్, లెనిన్ లో మాత్రం ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్ట‌ర్ లో కనిపించాడు. లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీక్వెన్స్ లో అఖిల్ చూపించిన మెచ్యూరిటీ ఆడియ‌న్స్ ను ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ క్యారెక్ట‌ర్ కోసం అఖిల్ తనలో చేసుకున్న మార్పు సినిమాకు ప్రధాన బలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక హీరో కెరీర్‌లో కొన్ని సినిమాలు కేవలం హిట్‌లుగా మాత్రమే మిగిలిపోతే, మరికొన్ని సినిమాలు అతని ఇమేజ్‌ను పూర్తిగా మార్చేస్తాయి. ప్రస్తుతం అఖిల్ కెరీర్లో లెనిన్ అదే తరహా సినిమాగా నిలుస్తోందనే డిస్క‌ష‌న్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఈ స‌క్సెస్‌కు నాగార్జున తీసుకున్న నిర్ణయాలేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ స్టార్ డైరెక్టర్‌ల వెంటపడకుండా, కథపై నమ్మకం ఉన్న డైరెక్ట‌ర్ మురళీ కిషోర్ అబ్బూరుకు అవకాశం ఇవ్వడం, కమర్షియల్ అంశాలతో పాటు యాక్ట‌ర్ గా అఖిల్‌ను కొత్త కోణంలో చూపించే కథను ఎంచుకోవడం వంటి డెసిష‌న్స్ సరైనవేనని ఇప్పుడు రిజ‌ల్ట్స్ చెబుతున్నాయి. లెనిన్ సినిమాను అఖిల్ ఇమేజ్‌కు తగ్గట్టు కాకుండా, కథకు తగ్గట్టుగా రూపొందించడమే ఆడియ‌న్స్‌కు కొత్త అనుభూతిని ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రమోషన్స్ విషయంలో కూడా మేక‌ర్స్ ఫాలో అయిన స్ట్రాట‌జీ చర్చనీయాంశమైంది. రిలీజ్ కు ముందు ఎక్కువ‌ హడావుడి చేయ‌కుండా కంటెంట్‌పై నమ్మకంతో ముందుకెళ్లడం, రిలీజ్ తర్వాత ఆడియ‌న్స్ రెస్పాన్స్ ను బాగా వినియోగించుకోవడం సినిమాకు కలిసి వచ్చిందని భావిస్తున్నారు. మొదటి రోజు తర్వాత మౌత్ టాక్ మరింత బలపడటం, ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా సినిమాను ఆదరించడం వల్ల లెనిన్ బాక్సాఫీస్ జ‌ర్నీ రోజురోజుకూ బలపడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అఖిల్ యాక్టింగ్‌పై సాధార‌ణ ప్రేక్ష‌కుల నుంచే కాకుండా సినీ పరిశ్రమ నుంచి వస్తున్న ప్రశంసలు కూడా సినిమాకు అదనపు బలంగా మారాయి. డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ ను ప్రశంసించగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా లెనిన్ పై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తనను ఆనందపరిచిందని పేర్కొన్నారు. అఖిల్ తనకు మరో కొడుకులాంటివాడని చెబుతూ, ప్రతి సినిమాతో అఖిల్ నటుడిగా మరింత పరిణతి సాధిస్తున్నాడని కొనియాడ‌టం చూస్తుంటే అఖిల్ యాక్ట‌ర్ గా కూడా స‌క్సెస్ సాధించిన‌ట్టే లెక్క‌. ఈ తరహా ప్రశంసలు కేవలం వ్యక్తిగత అభినందనలుగానే కాకుండా, అఖిల్ కొత్త ఇమేజ్‌కు ఇండస్ట్రీ నుంచి లభిస్తున్న గుర్తింపుగా అంద‌రూ భావిస్తున్నారు.

లెనిన్ స‌క్సెస్‌ తర్వాత అఖిల్ కెరీర్‌పై అంచనాలు కూడా మారుతున్నాయి. ఇకపై ఆయన కోసం కథలు రాసే విధానం, నిర్మాతల ఆలోచన, డైరెక్ట‌ర్ల‌ దృష్టికోణం కూడా భిన్నంగా ఉండే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిట్ సినిమా కంటే, హీరోగా తనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడమే పెద్ద విజయమని చెబుతుంటారు. ఆ విధంగా చూస్తే లెనిన్, అఖిల్‌కు కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే మైలురాయి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.