బాక్సాఫీస్ స్లోడౌన్‌లో 'లెనిన్'కి లక్… అఖిల్ అక్కినేని హిట్ కొడతాడా?
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
By: Madhu Reddy | 6 July 2026 7:00 PM ISTఅక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, అఖిల్ అక్కినేని ఈసారి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి పక్కా ప్లానింగ్‌తో సిద్ధమయ్యాడు. మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయకపోవడం, 'లెనిన్' ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అదే మూవీ కి కలిసి వచ్చేలా వుంది..
బాక్సాఫీస్ పరిస్థితి.. అఖిల్‌కు దక్కిన లక్:
ఇప్పటికి సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో కలెక్షన్లలు రాబడుతుంది. అయితే, ఈ వారం విడుదలైన 'రావుబహదూర్' చిత్రంతో పాటు విరాట్ కర్ణ, అభిషేక్ నామా కాంబోలో వచ్చిన 'నాగబంధం' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. మార్కెట్ కాస్త స్లోగా ఉన్న ఈ టైమ్‌లో ‘లెనిన్’ థియేటర్లలోకి వస్తుండటం అఖిల్‌కు దక్కిన అరుదైన లక్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్.. పెరిగిన అంచనాలు:
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారనే రూమర్స్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాకు తన సపోర్ట్ అందిస్తున్నారనే టాక్ ‘లెనిన్’ హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. కానీ నిన్న తిరుపతి లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిధి గా వచ్చి సపోర్ట్ చేశారు..
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ స్టోరీ:
ఇక 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్, ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివాజీ, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. "ఈసారి మీరు ఊహించని విధంగా సినిమా ఉంటుంది" అని హైప్ పెంచగా, అఖిల్ కూడా "నన్ను మీ ఇంటికి తీసుకెళ్లేలా, మీవాడు అనుకునేలా ఈ మూవీ ఉంటుంది, ఆదరించండి" అని ఎమోషనల్ అయ్యాడు.
ఇప్పటి పరిస్థితుల్లో అఖిల్‌కు మంచి ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తోంది. అయినా, ఫైనల్‌గా సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పూర్తిగా కంటెంట్‌పైనే డిపెండ్ అవుతుంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ కనుక వస్తే, ఈ అనుకూల పరిస్థితులను వాడుకుని అఖిల్ అక్కినేని బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ ర్యాంపేజ్ సృష్టించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
