అఖిల్ 'లెనిన్' లో ఐటెం సాంగ్? ఆమెనే ఆడిపాడనుందా?
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్ లో పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 7:00 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్ లో పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అఖిల్.. తన యాక్టింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. కానీ భారీ హిట్ ను సొంతం చేసుకోలేకపోయారు. చివరగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. నిరాశపరిచారు.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా.. డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన అఖిల్.. ఇప్పుడు లెనిన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల అఖిల్ కు జోడీగా నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ.. గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండనున్నట్లు క్లియర్ గా అర్థమైంది. గ్లింప్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
స్టార్టింగ్ లో యాడ్ చేసిన మైథాలజీ గ్లింప్స్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో పూర్తి రగ్డ్ లుక్ లో అఖిల్ కనిపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో షూట్ కూడా చేయనున్నారని సమాచారం.
అయితే రీసెంట్ గా అఖిల్ కు వివాహం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మూవీ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు. నెల రోజుల పాటు ఆయన అందుబాటులో ఉండనని మేకర్స్ కు చెప్పారట. దీంతో ఆ గ్యాప్ లో ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ పాటను ప్రముఖ సింగర్ మంగ్లీతో పాడించారని సమాచారం.
ఐటెం సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో చేయిస్తే అదిరిపోతుందని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లైగర్ తో టాలీవుడ్ లోకి రాగా.. ఇప్పుడు లెనిన్ మేకర్స్ సంప్రదిస్తున్నట్టు సమాచారం. అన్నీ సిద్ధం చేసి.. స్పెషల్ సాంగ్ ను మేకర్స్ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాలి.
