రెండో వారంలో ఈ సినిమాల పరిస్థితి ఏంటి?
ప్రతి వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు రావడం, రెండో వారం లేదా మూడో వారంకి వచ్చిన సినిమాలు వెళ్లి పోవడం చూస్తూనే ఉన్నాం.
By: Ramesh Palla | 11 July 2026 1:33 PM ISTప్రతి వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు రావడం, రెండో వారం లేదా మూడో వారంకి వచ్చిన సినిమాలు వెళ్లి పోవడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద రెండు మూడు వారాల పాటు మంచి వసూళ్లు రాబడితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు 50 రోజులు, 100 రోజులు అంతకు మించి ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రెండు మూడు వారాలకే ఆహా.. ఓహో అనాల్సి వస్తుంది. చాలా వరకు సినిమాలు మొదటి వారం తర్వాత కనీసం కనిపించడం లేదు. యావరేజ్ టాక్ వచ్చినా కూడా రెండో వారంకు థియేటర్‌లో ఉంటాయా లేదా అనే అనుమానం ఉంది. తర్వాత వారం ఏదైనా పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా వస్తే అంతకు ముందు వచ్చిన సినిమాలను తొలగించడం కామన్ అయింది. గత వారం నాగబంధం, రావు బహదూర్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. రెండో వారంలో వాటి పరిస్థితి ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సమంత మా ఇంటి బంగారం బాక్సాఫీస్ రిపోర్ట్...
సమంత మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ సందడి చేస్తున్న సమయంలో గత వారం నాగబంధం, రావు బహదూర్ సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు, ప్రమోషన్ బజ్ క్రియేట్ చేయడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. వీక్ డేస్‌లోనూ ఈ రెండు సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఈ వారంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ మూవీ విడుదల అయ్యింది. అఖిల్ మూవీస్ వరుసగా నిరాశ పరుస్తూ వస్తున్నప్పటికీ ఈ సినిమాపై మొదటి నుంచి బజ్ క్రియేట్ అయ్యింది. బజ్‌కు ఏమాత్రం తగ్గకుండా లెనిన్ ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను మెప్పించింది. పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ వీకెండ్ భారీ వసూళ్లు నమోదు చేస్తుందని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ లెనిన్ కలెక్షన్స్...
అఖిల్ లెనిన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న నేపథ్యంలో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు ఏ మేరకు రెండో వారం వసూళ్లు సాధిస్తాయా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. వీకెండ్‌లో ఆ రెండు సినిమాలు మినిమం వసూళ్లు రాబట్టగలవు. లెనిన్ సినిమా తర్వాత కచ్చితంగా ఆ రెండు సినిమాలకు స్కోప్ ఎక్కువ ఉంది. లెనిన్ కాకుండా చూసేందుకు ఆ రెండు సినిమాలు మాత్రమే ఉండటంతో ఈ వీకెండ్‌లో మినిమంగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. నాగబంధం సినిమా గ్రాఫిక్స్‌తో పాటు, కాన్సెప్ట్ పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సోషల్ మీడియాలో దాని గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతే కాకుండా రావు బహదూర్ మూవీ విషయంలోనూ బాక్సాఫీస్ వర్గాల వారు పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం విశేషం.
నాగబంధం, రావు బహదూర్ బాక్సాఫీస్ రిపోర్ట్
ఇప్పటికే రావు బహదూర్ మూవీ బ్రేక్ ఈవెన్‌కి దగ్గరకు వచ్చిందని, కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సైతం సాధ్యం అయిందనే సమాచారం అందుతోంది. మహేష్ బాబు సమర్పణలో వచ్చిన మూవీ కావడంతో ప్రేక్షకుల నుంచి ముఖ్యంగా మహేష్ బాబు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక నాగబంధం సినిమాకు మంచి ఓపెనింగ్స్ నమోదు అయినప్పటికీ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరగడంతో పాటు, అన్ని ఏరియాలోనూ మంచి బిజినెస్ చేసింది. అందుకే బ్రేక్ ఈవెన్ అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. అయితే భారీ మొత్తంలో నష్టం మాత్రం రాకపోవచ్చు అనేది కొందరి మాట. మొత్తానికి అఖిల్ అక్కినేని లెనిన్ రావడంతో ఈ రెండు సినిమాలపై ప్రభావం ఉంటుంది, కానీ మరే సినిమాలు లేకపోవడంతో ఒక మోస్తరు వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక సమంత మా ఇంటి బంగారం ఈ వారం అంతగా ప్రభావం చూపించక పోవచ్చని కొందరి అభిప్రాయం.
