బ్లాక్‌బస్టర్ అంటే ఏమిటో ‘లెనిన్’ చూపిస్తుంది - నాగవంశీ
అక్కినేని అఖిల్ హీరోగా, మురళీకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ‘లెనిన్’ సినిమా సాలిడ్ హిట్‌తో దూసుకుపోతుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
By: Madhu Reddy | 11 July 2026 4:49 PM ISTఅక్కినేని అఖిల్ హీరోగా, మురళీకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ‘లెనిన్’ సినిమా సాలిడ్ హిట్‌తో దూసుకుపోతుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్లు పడిన కష్టం, త్యాగం ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి పోస్టర్ మీద బ్లాక్‌బస్టర్ అని వేస్తే జనాలు ఎటకారం చేస్తారని, కానీ నిజమైన బ్లాక్‌బస్టర్ అంటే ఏంటో 'లెనిన్' కలెక్షన్లు చూస్తే అర్థమవుతుందని అయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వివరాలు చూద్దాం..
టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు:
సినిమా రిలీజ్‌కు ముందు తన పరిస్థితిని నాగవంశీ గుర్తుచేసుకున్నారు. "సాధారణంగా రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచే టెన్షన్ వల్ల నిద్ర పట్టదు. నిన్న కలెక్షన్ల లెక్కలు, రెస్పాన్స్ చూశాక వచ్చిన ఆనందంలో అస్సలు నిద్రపోలేదు. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఇన్స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా అఖిల్ హిట్ కొట్టాడనే రీల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అఖిల్‌కు ఒక మంచి హిట్ రావాలని ఆడియన్స్ కూడా జెన్యూన్‌గా కోరుకున్నారు" అని వంశీ తెలిపారు.
సంక్రాంతి సినిమాల రేంజ్ డిమాండ్:
సాధారణంగా థియేటర్ల కౌంట్ పెంచమని, అదనపు స్క్రీన్లు యాడ్ చేయమని అడిగే పరిస్థితి కేవలం సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చినప్పుడే చూస్తాం. కానీ 'లెనిన్' సినిమాకు సోలో రిలీజ్ వచ్చినప్పటికీ, క్రేజ్ చూసి థియేటర్ల ఓనర్లు స్క్రీన్లు పెంచమని అడుగుతున్నారు. ఇక గత మూడు నాలుగు నెలలుగా థియేటర్లకు జనాలు రావడం లేదనే టాక్ ఉండేది. అలాంటి పొజిషన్ నుంచి ఇప్పుడు థియేటర్లు యాడ్ చేయమనే స్టేజ్‌కి రావడం మామూలు విషయం కాదు.
బుక్ మై షోలో బుకింగ్స్ యుద్ధం:
సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఇలాంటి పక్కా మాస్ సినిమా వర్కవుట్ అవుతుందా అని మొదట్లో కాస్త భయపడ్డామన్నారు నాగవంశీ. కానీ ఇప్పుడు బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూస్తే టికెట్ల కోసం పెద్ద యుద్ధమే జరుగుతోందని చెప్పారు. ఇక నిన్న ఒక్క తిరుపతిలోనే ఏకంగా 7 థియేటర్లలో ఈ సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో నడవడం ఈ సినిమా సృష్టించిన ప్రభంజనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
నిజమైన బ్లాక్‌బస్టర్ అంటే ఇదే:
ఇటీవల కాలంలో ఏ సినిమా వచ్చినా పోస్టర్ల మీద ‘బ్లాక్‌బస్టర్’ అని వేసేస్తుండటంతో ప్రేక్షకులు కూడా లైట్ తీసుకుంటున్నారు, కొన్నిసార్లు ఎటకారం చేస్తున్నారు. కానీ ‘లెనిన్’ సాధిస్తున్న వసూళ్లు, జనాల్లో ఉన్న క్రేజ్ చూశాక.. అసలైన బ్లాక్‌బస్టర్ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించిందని నాగవంశీ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇక అఖిల్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.
నాగవంశీ మాటలు వింటుంటే అక్కినేని ఫ్యాన్స్‌లో జోష్ మరింత పెరిగిపోతోంది. థియేటర్ల కొరత నుంచి స్క్రీన్లు పెంచే స్థాయికి 'లెనిన్' చేరిందంటే బాక్సాఫీస్ దగ్గర అఖిల్ మాస్ ర్యాంపేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వసూళ్ల రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
