Begin typing your search above and press return to search.

భార్య‌తో అక్కినేని చియాన్ జ‌పాన్ ట్రిప్ వెన‌క అసలు కారణమిదే!

‘లెనిన్’ విజయంతో జోష్‌లో ఉన్న అఖిల్ భార్య జైనాబ్‌తో కలిసి రెండు వారాల పాటు జపాన్ వెళ్లారు. డిసెంబర్ 11న అక్కడ విడుదల కానున్న ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు. సినిమా ప్రచారంతో పాటు భార్యతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఈ ట్రిప్ ప్లాన్ చేశారు.

By:  Sivaji Kontham   |   27 Nov 2026 9:31 AM IST
భార్య‌తో అక్కినేని చియాన్ జ‌పాన్ ట్రిప్ వెన‌క అసలు కారణమిదే!
X

అక్కినేని అఖిల్‌కు చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన సాలిడ్ హిట్ చివరికి 2026లో విడుదలైన `లెనిన్` చిత్రంతో సాధ్యమైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జెన్యూన్ హిట్‌గా నిలవడంతో అఖిల్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భార్య జైనాబ్ రావుజీ అడుగుపెట్టిన వేళావిశేషంతోనే అఖిల్ కెరీర్ మలుపు తిరిగిందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు తన `లక్కీ ఛామ్` జైనాబ్‌తో కలిసి సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్న అఖిల్.. ఏకంగా రెండు వారాల సుదీర్ఘ పర్యటన కోసం జపాన్‌కు వెళ్లడం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే అఖిల్ తన సతీమణితో కలిసి జపాన్ వెళ్లడం వెనుక కేవలం విహారయాత్ర మాత్రమే కాదు.. ఒక ప్రత్యేకమైన వృత్తిప‌ర‌మైన‌ కారణం కూడా ఉంది. తెలుగులో మంచి విజయం సాధించిన `లెనిన్` చిత్రాన్ని డిసెంబర్ 11న జపాన్‌లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుగానే జపాన్ చేరుకున్న అఖిల్ అటు సినిమా ప్రచారంతో పాటు ఇటు భార్య జైనాబ్‌తో కలిసి విలువైన సమయాన్ని గడిపేలా రెండు వారాల ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. బిజీ షెడ్యూల్స్ ఉండే ఒక స్టార్ హీరోకు ఇది నిజంగానే లాంగ్ ట్రిప్ అయినా పర్సనల్ - ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ అఖిల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక `లెనిన్` అందించిన ఉత్సాహంతో అఖిల్ తన తదుపరి సినిమాల ఎంపికలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ కథలకు దూరంగా ఉంటూ.. బలమైన కంటెంట్.. కొత్తదనం ఉన్న స్క్రిప్టులకు మాత్రమే ఈ యువ‌హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో `ధీర` అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తారని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. దీనికి తోడు టాలీవుడ్‌లోని ఒక ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్‌తో మరో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కూడా లైన్‌లో పెట్టి.. 2027-28 సీజ‌న్‌లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లకు ప్లాన్ చేస్తున్నాసార‌ని స‌మాచారం.

త‌న కెరీర్ జెన్యూన్ హిట్ సినిమాతో జ‌పాన్ లో అడుగుపెట్ట‌డం మంచి నిర్ణ‌య‌మే. లెనిన్ ప్ర‌చార వేడుక‌ల‌తో అఖిల్ అక్క‌డ ప‌రిచ‌యం అవుతారు. జపాన్ ప్రేక్షకులు తెలుగు సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్న నేపథ్యంలో `లెనిన్` ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.. అఖిల్‌కు జపాన్ మార్కెట్‌లో ఏ స్థాయి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి.