Begin typing your search above and press return to search.

2 సర్జరీలు.. 48 కుట్లు.. 16 నెలలు విశ్రాంతి..ఏజెంట్ తర్వాత గ్యాప్ పై అఖిల్ స్పందన!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ చాలా కాలం తర్వాత 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే గత మూడేళ్లుగా ఆయన వెండితెరకు ఎందుకు దూరమయ్యారనే సస్పెన్స్‌కు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెరదించారు.

By:  Madhu Reddy   |   2 July 2026 7:26 PM IST
2 సర్జరీలు.. 48 కుట్లు.. 16 నెలలు విశ్రాంతి..ఏజెంట్ తర్వాత గ్యాప్ పై అఖిల్ స్పందన!
X

అక్కినేని యంగ్ హీరో అఖిల్ చాలా కాలం తర్వాత 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే గత మూడేళ్లుగా ఆయన వెండితెరకు ఎందుకు దూరమయ్యారనే సస్పెన్స్‌కు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెరదించారు. 'ఏజెంట్' సినిమా తర్వాత ఆయన బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఎడమ చేతికి తీవ్ర గాయమైందట. ఏకంగా 48 కుట్లు పడటం, కోలుకోవడానికి 16 నెలల టైమ్ పట్టడం వల్లే ఈ గ్యాప్ వచ్చిందని అఖిల్ షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

బాత్రూమ్‌లో ఘోర ప్రమాదం.. 48 కుట్లు:

'ఏజెంట్' సినిమా విడుదలైన కొద్ది రోజులకే అఖిల్ ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు. బాత్రూమ్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా జారిపడటంతో అక్కడున్న గాజు ముక్కలు ఆయన ఎడమ చేతికి గట్టిగా గుచ్చుకున్నాయి. ఇక దీంతో చేతి వేళ్లకు ఏకంగా రెండుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ గాయం వల్ల దాదాపు 48 కుట్లు పడ్డాయని, 8 నెలల పాటు కనీసం బరువులు కూడా ఎత్తలేని పరిస్థితి ఏర్పడిందని అఖిల్ వివరించారు.

కోలుకోవడానికి 16 నెలల సమయం:

ఈ ఘోరమైన గాయం నుండి అఖిల్ పూర్తిగా కోలుకోవడానికి ఏకంగా 16 నెలల సుదీర్ఘ సమయం పట్టింది. ఈ కారణం వల్లే సినిమాలు చేయలేకపోయానని ఆయన చెప్పారు. "మూడేళ్ల పాటు గ్యాప్ రావడంతో నా ఫ్యాన్స్ నాపై కాస్త కోపంగా ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితి మళ్లీ రాదని, ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని నా అభిమానులకు ప్రామిస్ చేస్తున్నాను" అని అఖిల్ ఎమోషనల్ అయ్యారు.

జూలై 10న 'లెనిన్' గ్రాండ్ రిలీజ్:

మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా జులై 10న థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.

మాస్ లుక్‌లో అక్కినేని వారసుడు:

ట్రైలర్ చూస్తే ఈ సినిమా ప్రేమ, కుటుంబ కలహాలు, పరువు హత్యలు వంటి సామాజిక అంశాల చుట్టూ తిరిగే ఒక పక్కా గ్రామీణ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. ఇందులో అఖిల్ ఒక పల్లెటూరి సామాన్య యువకుడిగా ఊరమాస్ లుక్‌లో కనిపించి మెప్పించారు. ఇక ఈ సినిమాపై నాగార్జున, నాగచైతన్యతో పాటు అక్కినేని ఫ్యామిలీ అంతా ఫుల్ నమ్మకంతో ఉన్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది.

గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ఈసారి మాత్రం 'లెనిన్' సినిమాతో అఖిల్ గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇక నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన ఈ మాస్ యాక్షన్ మూవీ అఖిల్ కెరీర్‌కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇస్తుందో తెలియాలంటే జూలై 10 వరకు వెయిట్ చేయాల్సిందే..