2026 అఖిల్ కి అనుకూలంగా ఉందా?
అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభమై దశాబ్దం దాటింది. 2015 లో `అఖిల్` చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యాడు.
By: Srikanth Kontham | 20 Dec 2025 10:52 AM ISTఅక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభమై దశాబ్దం దాటింది. 2015 లో `అఖిల్` చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యాడు. కానీ తొలి సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. అటుపై ఏడాది గ్యాప్ లో `హలో` తో ప్రేక్షకుల్ని పలకరించాడు. డెస్టినీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా మాత్రం యావరేజ్ గా ఆడింది. కానీ అది అక్కినేని అభిమానుల స్థాయి సక్సెస్ కాదు. అనంతరం ఈసారి మరింత కసరత్తులు చేసాడు. ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని 2019 లో 'మిస్టర్ మజ్ను' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమా ఊహించని ఫలితాన్ని అందించింది.
సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ:
అఖిల్ కెరీర్ లో తొలి డిజాస్టర్ గా నమోదైంది. అటుపై ఏడాది గ్యాప్ లోనే 2021 లో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` మరో క్లాసిక్ అటెంప్ట్ చేసాడు. ఈ సినిమా బాగానే ఆడింది. కానీ అభిమానుల్లో ఎక్కడో అసంతృప్తి. దీంతో లాభం లేదనుకున్న అఖిల్ ఈసారి ఏకంగా స్పై జోనర్ లో 'ఏజెంట్' అనే యాక్షన్ థ్రిల్లర్ చేసాడు. ఈ సినిమాతో అఖిల్ యాక్షన్ స్టార్ అవ్వడం ఖాయమనుకున్నారంతా. కానీ అఖిల్ కెరీర్ లో సెకెండ్ డిజాస్టర్ గా నమోదైంది. దీంతో అఖిల్ నుంచి మూడేళ్లగా ఎలాంటి సినిమా రిలీజ్ అవ్వలేదు. ఈ పదేళ్ల కెరీర్ లో సక్సెస్ కంటే? ఫెయిల్యూర్స్ ఎక్కువ చూసాడు.
అన్ని వైపులా పాజిటివ్ వైబ్:
ఈ నేపథ్యంలో తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరీ నేల విడిచి సాము చేయకుండా? రాయలసీమ నేపథ్యంలోకి వెళ్లి `లెనిన్` అనే సినిమా చేస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొస్తున్నాయి. అఖిల్ సీమ యాసలో డైలాగులు..ఆహార్యం ప్రతీది ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కొత్త ఏడాది ప్రధమార్ధంలోనే చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు అన్ని వైపులా పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.
కొత్త కథలు వింటున్నాడా:
కంటెంట్ పరంగా ఎలాంటి బలహీనతలు కనిపించలేదు. తాజాగా అఖిల్ కి 2026 బాగా కలిసొచ్చే ఏడాది అవుతుం దని నమ్ముతున్నారుట. అతడి జాతక రీత్యా కూడా సంకల్పించిన కార్యాలన్నీ దిగ్విజయంగా సిద్దిస్తాయని సన్నిహితుల మధ్య డిస్కషన్ తో తెరపైకి వచ్చింది. అదే నిజమైతే? అసలైన సక్సెస్ ని అఖిల్ 2026 లో చూడటం ఖాయమే. అది `లెనిన్` తో సాధ్యమైతే? అక్కినేని అభిమానులు మరింత సంతోషిస్తారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో అఖిల్ కొత్త కథల విషయంలోనూ సీరియస్ గా డిస్కషన్స్ చేస్తున్నాడుట. ఇప్పటికే కొంత మంది రైటర్లు కూడా స్టోరీ వినిపించారట. నచ్చిన వాటిని లాక్ చేసి పెట్టినట్లు వినిపిస్తోంది.
