Begin typing your search above and press return to search.

'లెనిన్' లో హీరోయిన్ లీల‌లు అంత హాట్ గానా!

అక్కినేని అఖిల్ కూడా కొన్ని సినిమాల్లో ట్రై చేసాడు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడొస్తున్న‌ట్లే క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   13 April 2025 7:00 PM IST
లెనిన్ లో హీరోయిన్ లీల‌లు అంత హాట్ గానా!
X

అక్కినేని ఫ్యామిలీ హీరోల‌కు రొమాంటిక్ స్టార్లు అనే ట్యాగ్ ఉండ‌నే ఉంది. ఏఎన్నార్, నాగార్జున‌, నాగ చైత‌న్య ఇలా మూడు త‌రాలు వెండి తెర‌పై రొమాన్స్ లో త‌మ బ్రాండ్ ని ఎప్పుడో వేసేసారు. ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ని కెరీర్ ఆరంభంలోనే ద‌క్కించుకున్నారు. అక్కినేని అఖిల్ కూడా కొన్ని సినిమాల్లో ట్రై చేసాడు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడొస్తున్న‌ట్లే క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం కిషోర్ అబ్బూరు `లెనిన్` అనే సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అఖిల్, శ్రీలీల జంట‌గా న‌టిస్తున్నారు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే సినిమాకి సంబంధించిన ఓ మాప్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సీమ యాస‌లో అఖిల్ అద‌రగొట్టాడు? అనే పాజిటివ్ ఇంప్రెష‌న్ గ్లింప్స్ తోనే ప‌డింది. ఇక టీజ‌ర్, ట్రైల‌ర్ లో అఖిల్ అస‌లైన సినిమా చూపిస్తాడు? అనే న‌మ్మ‌కంతో ఉన్నారు.

సీమ స్టోరీ కావ‌డంతో కంటెంట్ అంతే మాస్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఇందులో ఘాడమైన రొమాన్స్ కూడా ఉంద‌ని వెలుగులోకి వ‌స్తోంది. అఖిల్...శ్రీలీల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేవాల‌కు ఏమాత్రం కొద‌వ‌లేదుట‌. ఈ రొమాన్స్ సీమ స్టైల్లో ఉంటుందంటున్నారు. ఇంత వ‌ర‌కూ సీమ స్టైల్ రొమాన్స్ ఏ సినిమాలోనూ హైలైట్ కాలేదు. సీమ అనే స‌రికి యాక్ష‌న్ త‌ప్ప ప్రేక్ష‌కుడికి మ‌రో ఆలోచ‌న రాదు.

కానీ మ‌ధ్య‌లో దాన్ని డీవీయేట్ చేస్తూ అఖిల్- శ్రీలీల మ‌ధ్య రొమాన్స్ కూడా బాగా పండుతుందంటున్నారు. అఖిల్ -శ్రీలీల మ‌ధ్య లిప్ లాక్ స‌న్నివేశాలున్నాయట‌. వాటిని అంతే నేచుర‌ల్ గానే షూట్ చేస్తున్నారుట‌. అలాగే శ్రీలీల‌ను తెర‌పై వీలైనంత హాట్ గా..బ్యూటీఫుల్ గా ఆవిష్క‌రిస్తున్న‌ట్లు లీకులం దుతున్నాయి.