Begin typing your search above and press return to search.

అఖండ‌2లో సీనియ‌ర్ హీరోయిన్?

నంద‌మూరి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీను వీరి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుందంటే దానిపై ఏ రేంజ్ లో అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

By:  Tupaki Desk   |   20 April 2025 5:03 AM
Akhandha 2: Rumors of Vijayashantis Role Spark Excitement
X

నంద‌మూరి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీను వీరి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుందంటే దానిపై ఏ రేంజ్ లో అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒక‌దాన్ని మించి ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్లు గా నిలిచి వీరి కాంబినేష‌న్ ను సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ ను చేశాయ‌న్న సంగతి తెలిసిందే.

అఖండ సినిమా వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సినిమాల్లో అన్నింటికంటే పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ‌2 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అస‌లే బాల‌య్య‌- బోయ‌పాటి కాంబో, దానికి తోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ‌కు సీక్వెల్ గా వ‌స్తున్న సినిమా కావ‌డంతో అఖండ‌2 పై అంద‌రికీ అంచ‌నాలు తారా స్థాయిలో ఉన్నాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాపై నెట్టింట ఓ క్రేజీ రూమ‌ర్ వినిపిస్తోంది.

అఖండ‌2లో టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ విజ‌యశాంతి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అంతేకాదు, అఖండ‌2లో ఆమె పొలీటిషియ‌న్ గా క‌నిపించ‌నుంద‌ని కూడా అంటున్నారు. ఆల్రెడీ గ‌తంలో బాల‌య్య‌- విజ‌యశాంతి కాంబినేష‌న్ లో ఎన్నో హిట్ సినిమాలు రాగా, ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి అఖండ‌2లో న‌టిస్తే సినిమాపై అంచ‌నాలు మ‌రిన్ని పెర‌గ‌డం ఖాయం.

దీనిపై మేక‌ర్స్ నుంచి అయితే ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు కాబ‌ట్టి ఇప్ప‌టివ‌ర‌కైతే అఖండ‌2లో విజ‌యశాంతి న‌టిస్తుంద‌నే వార్త పుకారనే చెప్పాలి. ఒక‌వేళ న‌టిస్తే అఖండ‌2కు విజ‌య‌శాంతి కూడా అద‌న‌పు ఎట్రాక్ష‌న్ అయ్యే అవ‌కాశముంది. ప్ర‌గ్యా జైస్వాల్, సంయుక్త మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న అఖండ‌2 సినిమాను 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.

త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అఖండ సినిమా రికార్డుల‌ను అఖండ‌2 చెరిపి వేస్తుంద‌ని ఫ్యాన్స్ ఎంతో ధీమాగా ఉన్నారు. ఇక విజ‌యశాంతి విషయానికొస్తే రీసెంట్ గానే ఆమె నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.