Begin typing your search above and press return to search.

మెగా 'విశ్వంభర' తరహాలో బాలయ్య 'అఖండ 2'...!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ లో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్ మరియు అఖండ సినిమా లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి

By:  Tupaki Desk   |   12 Feb 2024 6:03 AM GMT
మెగా విశ్వంభర తరహాలో బాలయ్య అఖండ 2...!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ లో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్ మరియు అఖండ సినిమా లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా బాలయ్య కెరీర్‌ లో నిలిచి పోయేవి అనడంలో సందేహం లేదు. అందుకే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గతంలోనే బాలయ్య, బోయపాటి కాంబోలో అఖండ 2 ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలయ్య ఆసక్తిగా ఉండటంతో పాటు, బోయపాటి అఖండ 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత దర్శకుడు బోయపాటి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఈలోపు బాలయ్య తన ప్రస్తుత బాబీ చిత్రాన్ని కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య, బోయపాటి కాంబో మూవీ పై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. బాలయ్య మరోసారి అఘోర గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా అఘోర పాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది.

బోయపాటి ఈసారి బాలయ్య అఖండ 2 కోసం సోషియో ఫాంటసీ కథాంశం రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ కి మంచి ఆధరణ లభిస్తోంది. అందుకే మెగాస్టార్‌ చిరంజీవి కూడా వషిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తోనే చేస్తున్న విషయం తెల్సిందే.

విశ్వంభర తరహాలోనే బాలయ్య అఖండ 2 సినిమాను కూడా సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందించేందుకు గాను బోయపాటి స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. గతంతో పోల్చితే ఈసారి వీరి కాంబో మూవీ విభిన్నంగా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు కాస్త భక్తి టచ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

అఖండ 2 వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. విశ్వంభర మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు సీనియర్‌ హీరోలు సోషియో ఫాంటసీ తో సక్సెస్ దక్కించుకుంటారా అనేది చూడాలి.