Begin typing your search above and press return to search.

అఖండ 2 పై కూడా అలాంటి కామెంట్స్..!

ఈ క్రమంలో అఖండ 2 సినిమా మీద నిన్న మొన్నటిదాకా ఉన్న బజ్ కూడా స్కంద చూశాక బోయపాటి అఖండ 2 చేయకపోతేనే బెటర్ అనేస్తున్నారు

By:  Tupaki Desk   |   30 Sep 2023 9:30 AM GMT
అఖండ 2 పై కూడా అలాంటి కామెంట్స్..!
X

సినిమా తర్వాత సినిమాకు తన వైలెన్స్ పెంచుకుంటూ వెళ్తున్న బోయపాటి శ్రీను తన లేటెస్ట్ సినిమా స్కంద మీద ఎంత మిక్సెడ్ టాక్ ఉన్నా కూడా ఒక వర్గం ప్రేక్షకులు బోయపాటి ఏంటీ నరుకుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కథ, కథనాల కన్నా బోయపాటి యాక్షన్ సీన్స్ మీదే ఎక్కువ గురి పెడతాడు మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ అందించడమే తన లక్ష్యం అన్నట్టుగా సినిమాలు చేస్తాడు. అయితే బోయపాటి శ్రీను సినిమాల్లో సెంటిమెంట్ అనేది ఒక్కోసారి వర్క్ అవుట్ అవుతుంది ఒక్కోసారి కాదు స్కంద విషయంలో కూడా అదే జరిగింది.

అయితే టాక్ తో సంబంధం లేకుండా స్కంద వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే స్కంద వచ్చింది కదా స్కంద 2 కూడా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్కంద చూసే బాబోయ్ అనుకున్న ఆడియన్స్ స్కంద 2 అంటే కష్టమని అంటున్నారు. అయితే స్కంద 2 కాదు అఖండ 2 వచ్చినా కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అదేంటి అఖండ సూపర్ హిట్ కదా అంటే బోయపాటి సినిమాల్లో కొన్నిసార్లు మాత్రమే కథ సూట్ అవుతుందని అయినా కూడా దాని మీద కాకుండా బోయపాటి తన దృష్టి మొత్తం రక్తపాతం మీద పెడతాడని అంటున్నారు.

ఈ క్రమంలో అఖండ 2 సినిమా మీద నిన్న మొన్నటిదాకా ఉన్న బజ్ కూడా స్కంద చూశాక బోయపాటి అఖండ 2 చేయకపోతేనే బెటర్ అనేస్తున్నారు. అయితే స్కంద కథ వేరు అఖండ కథ వేరు. అఖండ లో బాలయ్య ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. రెండు పాత్రల్లో బాలయ్య అదరగొట్టాడు. ముఖ్యంగా శివ భక్తుడిగా అఘోరాని తలపిస్తూ బాలయ్య నటన అద్భుతంగా అనిపించింది. ఆ క్యారెక్టర్ బాగా కుదిరింది కాబట్టే అఖండ అంత పెద్ద హిట్ అయ్యింది.

అఖండ 2 కి అలా సెట్ అవుతుందని చెప్పడం కష్టం. ఒక మీట దాటాక బోయపాటి తన ఫోకస్ అంతా యాక్షన్ మీద పెడతాడు తప్ప సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడడు. అందుకే బోయపాటి అఖండ 2 చేయడం ఎందుకు బాలయ్యతో మరో కొత్త కథని చేస్తే బెటర్ అని చెబుతున్నారు.