Begin typing your search above and press return to search.

అఖండ 2.. బోయపాటి ఏమన్నారంటే..

అయితే అఖండకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలో ప్రకటించాడు. దీంతో నందమూరి అభిమానులు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 April 2024 4:06 AM GMT
అఖండ 2.. బోయపాటి ఏమన్నారంటే..
X

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన మూడో సినిమా అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు. వారి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంతకు మించి అఖండ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాలో బాలయ్య చేసిన అఘోర క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే మూవీలో గూస్ బాంబ్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్, అంతకు మించి ఎమోషనల్ గా కనెక్ట్ చేసి డివైన్ ఎలిమెంట్ ని బోయపాటి సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా తర్వాత బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు.

అయితే అఖండకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలో ప్రకటించాడు. దీంతో నందమూరి అభిమానులు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్నికల హడావిడి కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక జూన్ లో మరల షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

ఇక అఖండ 2 ఎనౌన్సమెంట్ కూడా ఎన్నికల తర్వాతనే ఉండబోతోందని తాజాగాగా బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. ఓ టెంపుల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖండ 2కి సంబందించిన అప్డేట్ ఇచ్చారు. అఖండ మూవీలో ఎలాంటి కాన్సెప్ట్ అయితే ఉందో అలాగే సమాజానికి ఉపయోగపడే ఎలిమెంట్ తోనే అఖండ 2 కూడా ఉండబోతోందని స్పష్టం చేశారు.

ఎన్నికలు హడావుడి ముగిసిన తర్వాత సినిమాకి సంబందించిన అప్డేట్ ఉంటుందని తెలిపాడు. డివైన్ ఎలిమెంట్ కూడా కథలో అంతర్లీనంగా ఉంటుందని, దానిని ఎంత వరకు చెప్పాలో అంత చెబితే చాలని, ఆడియన్స్ ఆశ్వాదిస్తారని బోయపాటి చెప్పుకొచ్చారు. బోయపాటి చివరిగా స్కంద మూవీతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు.

దీంతో తనకి సెంటిమెంటల్ గా కలిసొచ్చిన బాలయ్యతో మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అఖండ 2 మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో తెరకెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే గతంలో బన్నీతో కూడా ఒక సినిమా చేస్తారని టాక్ వచ్చింది. ఇక సూర్యతో కూడా ఒక కథపై చర్చలు జరిగాయి. మరి ఆ హీరోలతో బోయపాటి ఎప్పుడు సెట్స్ పైకి వెళతాడో చూడాలి.