సింహం-చిరు మధ్య దసరా వార్!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ 2 శివతాండవం` దసరా సందర్భంగా రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 7:30 AMనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ 2 శివతాండవం` దసరా సందర్భంగా రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవ సమయంలోనే రిలీజ్ సంగతి రివీల్ చేసారు. దీంతో దసరా రిలీజ్ లో ఇదే పెద్ద సినిమాగా ఇంత వరకూ హైలైట్ అయింది. అయితే ఇప్పుడీ బరిలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా దిగుతున్నట్లు సమాచారం. ఆయన కథానాయకుడిగా `విశ్వంభర` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా సీజీ ఆలస్యం కారణంగా డిలే అవుతుంది. ఏప్రిల్ రిలీజ్ అనుకున్నారు కానీ సాధ్యపడలేదు. దీంతో జూన్ తర్వాత ఎప్పుడైనా ఉండే అవకాశం ఉందని కొత్త ప్రచారం మొదలైంది. అయితే మేకర్స్ మాత్రం దసరా సీజన్ అయితే బాగుంటుందని ఆ తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దసరాకి అయితే కావాల్సిన సమయం కూడా ఉంటుందని కూల్ గా సీజీ పూర్తి చేయోచ్చని భావిస్తున్నారుట.
ఈ నేపథ్యంలో `విశ్వంభర` దసరా రేసులోకి వస్తోంది. అదే జరిగితే చిరు-బాలయ్య మద్య మళ్లి బిగ్ వార్ తప్పదు. వీళ్లిద్దరు సినిమాలు రిలీజ్ అయితే వాతావరణం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇండి యా-పాకిస్తాన్ యుద్దం తరహాలోనే సన్నివేశాలు నెలకొంటాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో అంటూ పెద్ద సమరమే జరుగుతుంది.
ఎక్కువగా ఈ నయా స్టార్లు ఇద్దరు సంక్రాంతికి క్లాష్ అవుతుంటారు. దసరాకి క్లాష్ అవ్వడం అన్నది చాలా రేర్. కానీ ఈ దసరాకి మాత్రం తప్పేలా లేదు. దీంతో బాలయ్య మరింత సీరియస్ గా వార్ లో కి దిగుతారు. ఎట్టి పరిస్థితుల్లో అదే సీజన్ లో తన సినిమా రిలీజ్ అవ్వాలని...వెనక్కి తగ్గేది లేదంటారు. ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన తొలి నటుడిగా ప్రొజెక్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే.