అఖండ 2 టీజర్.. గూస్ బంప్స్..!
ఇక అఖండ 2 లేటెస్ట్ టీజర్ తో రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ లాక్ చేశారు.
By: Tupaki Desk | 9 Jun 2025 12:54 PMనందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ సూపర్ హిట్ కాగా అఖండ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ టీజర్ ఉంది. అఖండ 2 టీజర్ చూసిన వాళ్లంతా వావ్ గూస్ బంప్స్ అనక తప్పదు. ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కి ఎలాంటి కంటెంట్ తో రావాలో దానికి ఏమాత్రం తగ్గకుండా వచ్చేలా ఉన్నారు అఖండ 2 టీం.
ఇక టీజర్ విషయానికి వస్తే హిమాలయాల్లో ఉగ్ర అవతారంలో ఉన్న బాలయ్య శత్రువులను త్రిశూలంతో చీల్చి చెండాదుతాడు.. ఆ యాక్షన్ పార్ట్ టీజర్ లోనే హైలెట్. ఇక టీజర్ కి బోయపాటి టేకింగ్ ఒక హై ఇస్తే థమన్ ఇచ్చిన మ్యూజిక్ పూనకాలు తెప్పించేసింది. బాలయ్య బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్ అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు ఇలాంటి టీజరే కావాలనుకునేలా పర్ఫెక్ట్ ఫీస్ట్ అందించారు.
బాలయ్య మరోసారి అఘోరాగా విశ్వరూపాన్ని చూపించినట్టు ఉన్నారు. ముఖ్యంగా త్రిశూలం తో ఉన్న పోస్టర్ అయితే సిల్వర్ స్క్రీన్ పై చీటీలు చిరిపోయేలా ఉన్నాయంటే నమ్మాలి. బోయపాటి శ్రీను కూడా అఖండ 2 విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. అఖండ సినిమా కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే రిలీజై సూపర్ హిట్ కాగా అఖండ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది.
ఇక అఖండ 2 లేటెస్ట్ టీజర్ తో రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ లాక్ చేశారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ అవుతుంది అఖండ 2. ఈ సినిమాలో సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అఖండ 2 టీజర్ మ్యూజిక్ చూస్తుంటే మరోసారి బాలయ్య కోసం థమన్ డ్యూటీ ఎక్కేసినట్టే కనిపిస్తున్నాడు. సో బాలయ్య యాక్షన్ థమన్ మ్యూజిక్ రియాక్షన్ ఈసారి కూడా స్పీకర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.