రంగంలోకి బాలయ్య..మళ్లీ తాండవమే!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `అఖండ-2` షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Jun 2025 5:30 AMనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అఖండ-2' షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా టీమ్ అంతా పని చేస్తుంది. ప్రకటించిన రిలీజ్ తేదికే పక్కా రిలీజ్ చేయాలని అన్న కాన్సెప్ట్ తో టీమ్ రెస్ట్ లెస్ గా పని చేస్తోంది. వాళ్లతో పాటు బాలయ్య కూడా అంతే ఎనర్జీతో కనిపిస్తున్నారు.
ఇటీవలే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ముగించి జార్జియో వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీ కరించి తిరిగొచ్చారు. దీంతో కొన్ని రోజుల పాటు బాలయ్య అండ్ కో విశ్రాంతి తీసుకుంటుదనుకున్నారంతా. కానీ సోమవారం నుంచి రంగంలోకి దిగేశారు. రామోజీఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ నేడు మొదలైంది.
ఇందులో బాలయ్య సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ఇతర నటీనటులతో బాలయ్య పై కొన్ని కాంబినేషన్ సన్నివేశాలతో పాటు..సోలోగా కూడా మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందిట. పది- పదిహేను రోజులకు పైగా ఈ కొత్త షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ చిత్రీకరణ ఓ కొలిక్కి వస్తుందని చిత్ర వర్గాలంటున్నాయి. అటుపై పాటల చిత్రీకరణకు సంబంధించిన పనులు మొదలవుతాయని సమాచారం.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. ఈలోగా టాకీ పార్ట్ సహా పాటల చిత్రీకరణ ముగించాల్సి ఉంటుంది. షూటింగ్ పూర్త యినంత వరకూ గ్రాఫిక్స్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించకుండా? షూటింగ్ తో పాటు ఆ పనులు ముగిస్తున్నారు.