బాలయ్య కోసం దిగ్గజ ఓటీటీల పోరు!
ఇదిలా ఉంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు పోటీపడుతున్నట్టుగా తెలిసింది.
By: Tupaki Desk | 19 April 2025 7:00 PM ISTఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే ఈ మధ్య దానికి సీక్వెల్స్ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే చాలా సినిమాల సీక్వెల్స్ సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. మరి కొన్ని సెట్స్‌పై ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `అఖండ 2` ఒకటి. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి శ్రీను తొలిసారి తన పంథాని కొనసాగిస్తూనే సరికొత్త కథతో `అఖండ`ని తెరకెక్కించడం, అందులో బాలయ్యను అఘోరగా చూపించడం తెలిసిందే.
బాలకృష్ణ సరికొత్త గెటప్‌లో నటించిన `అఖండ` బాక్సాఫీస్ వద్ద పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి బాలకృష్ణ సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా అందించిన సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర బోయపాటి శ్రీను దీనికి సీక్వెల్‌గా `అఖండ 2`కు శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగతోంది. సంయుక్త మీనన్, ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ కోసం భారీ బడ్జెట్‌ని ఖర్చు చేస్తున్నారట. రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చయేస్తున్న బోయపాటి శ్రీను తాజాగా ఇంటర్వెల్ బ్యాంగ్‌కు సంబంధించిన కీలక ఘట్టాలని పూర్తి చేశారట. ఇదిలా ఉంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు పోటీపడుతున్నట్టుగా తెలిసింది.
`అఖండ` సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ దిగ్గజాలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లు ఓటీటీ హక్కుల కోసం పోటీపడుతున్నాయట. భారీ మొత్తం నాన్ థియేట్రికల్ హక్కులకు చెల్లిస్తామంటూ ఈ రెండు సంస్థలు ఆఫర్ చేశాయట. అయితే ఈ రెండింటిలో ఏ సంస్థకు`అఖండ 2` ఓటీటీ రైట్స్ దక్కుతాయన్నది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెలలోనే 14 రీల్స్ ప్లస్ వారు ఓటీటీ డీల్‌ని క్లోజ్ చేసే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.
