`అఖండ 2` నార్త్ ఇండియా పబ్లిసిటీ ఖర్చు అంతా?
బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా పూర్తి స్థాయి డివోషనల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు.
By: Tupaki Desk | 12 Jun 2025 3:00 PM ISTనందమూరి బాలకృష్ణ మాంచి జోష్ మీదున్నాడు. `అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్‌లకు శ్రీకారం చుట్టిన ఆయన ఆ తరువాత నుంచి అదే పంథాను కొనసాగిస్తూ వరుసగా విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న డివోషనల్ యాక్షన్ డ్రామా `అఖండ 2`. 2021 డిసెంబర్ 2న విడుదలై వసూళ్ల వర్షం కురిపించిన `అఖండ`కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా పూర్తి స్థాయి డివోషనల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా బాలయ్య పుట్టిన రోజు వేడుకలని పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు.
విడుదలైన 24 గంటల్లోనే ఈ టీజర్ 24 మిలియన్‌లకు పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. బాలయ్య మరోసారి అఘోరాగా విళయతాండవం చేయనున్న ఈ సినిమాని నార్త్ లోనూ బారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం నార్త్ సైడ్ పబ్లిసిటీకి 1.6 కోట్లు ఖర్చు చేస్తున్నారట. నార్త్‌లో ఇప్పటికే భారీ స్థాయిలో అఖండ 2 హోర్డింగ్‌లని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది కేవలం టీజర్ ప్రమోషన్స్‌కే ఖర్చు చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.
గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు, అందులోనూ డివోషనల్ టాచ్ ఉన్న సినిమాలకు నార్త్‌లో భారీ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో `అఖండ 2`కు కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందని, భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టే అవకాశం ఉందని టీమ్ బలంగా నమ్ముతోందట. అందు కోసమే నార్త్ సైడ్ పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
