జార్జియోలో అఘోర విశ్వరూపం!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ2` శివ తాండవం శర వేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2025 5:00 AM ISTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ2` శివ తాండవం శర వేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ సహా కుంభమేళాలో కీలక సన్నివేశాలు చిత్రీక రించారు. అఖండ2 మొదలైన సమయంలోనే కుంభమేళా కూడా రావడంతో? సినిమాకు మరింత కలి సొచ్చింది. కుంభమేళా సన్నివేశాలు సినిమాలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి.
`అఖండ 2` చిత్రీకరణకు సంబంధించి ఇప్పటి వరకూ ఈ రెండు ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగింది. ఇంత వరకూ ఔట్ డోర్ చిత్రీకరణకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ జార్జియోలో మొదలవుతుందని సమాచారం. అక్కడ సినిమాకు సంబంధించిన మరికొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించనున్నారుట. దీనిలో భాగంగా వేలాది మంది అఘోర గెటప్స్ లో ఆయా సన్నివేశాల్లో పాల్గొంటారని సమాచారం.
ఓ భారీ ప్రదేశంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలన్ని జార్జియో బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయట. హిందుత్వం కాన్సెప్ట్ కావడంతో? పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని కెనెక్ట్ చేయడానికి ఎక్కడా రాజీ పడకుండా టీమ్ పనిచేస్తోంది. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకున్న మత పరిస్థితులు...సనాతన ధర్మంపై హిందువుల్లో రగులుతోన్న పరిస్థితుల నేపథ్యంలో అఖండకు మరింతగా కలిసొస్తుంది.
హిందుత్వం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలపై నెటి జనులు ఇంటర్నెట్ లో సోధించడం పెరిగింది. అందులో అఖండ2 ముందు వరుసలో ఉంది. సరిగ్గా ఈ పాయింట్ ను బోయపాటి ఎన్ క్యాష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. సనాతనం...అఘోరాల వివిష్టతను మరింత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో విదేశీ గడ్డ జార్జియో కూడా భాగమవ్వడం విశేషం.
