వాసాలు కాదు కదిలిపోయేవి కూసాలు!
నటసింహ బాలకృష్ణ నోట పవర్ పుల్ డైలాగ్ వదిలితే ఎలా ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాన్స్ లో పూనకాలు లేస్తాయి..థియేటర్లు దద్దరిల్లిపోతాయి.
By: Tupaki Desk | 1 Aug 2025 6:00 PM ISTనటసింహ బాలకృష్ణ నోట పవర్ పుల్ డైలాగ్ వదిలితే ఎలా ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాన్స్ లో పూనకాలు లేస్తాయి..థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఈ తరహా వైబ్ క్రియేట్ చేయడం అన్నది బాల య్యకి మాత్రమే సాధ్యమైంది. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలున్నా? ఎలాంటి డైలాగులు చెప్పినా? రాని హైప్ బాలయ్య డైలాగులకు మాత్రం నల్లేరు మీద నడకలా సాధ్యమవుతుంది. బాలయ్య లో ఈ తరహా కోణాన్ని.. స్క్రీన్ ప్రజెన్స్ ని బోయపాటి పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. అందుకే ఆ కాంబినేషన్ లో ఇంత వరకూ వైఫల్యం అన్నది లేదు.
ఆ మూడింటిని మిక్సీలో
'సింహ', 'లెజెండ్', 'అఖండ' తో హ్యాట్రిక్ నమోదు చేయగలిగారు. బాలయ్యకు ఓ కొత్త ఇమేజ్ ను తీసుకు రాగలిగారు. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య 'అఖండ 2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ మూడు సినిమాలను మించిన పవర్ పుల్ డైలాగులుంటాయని అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. ఆ మూడు సినిమాలను మిక్సీలో వేసి తిప్పికే 'అఖండ 2' అనే అద్భుతం ఉంటుందని ఓ సెక్షన్ ఆడియన్స్ లో ఎంతో ఎగ్జైట్ మెంట్ కనిపిస్తోంది.
సిసలైన శివ తాండవం
బాలయ్య ఎలివేషన్ పీక్స్ లో ఉంటుందని, నెవ్వెర్ బిఫోర్ సీన్స్ తో? సిసలైన శివ తావడం ఎలా ఉంటుం దో `అఖండ2` లో చూపించబోతున్నాడని ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ఆద్యంతం ఎగ్జో టిక్ లోకేషన్లలో చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ అంతా ప్రత్యేక సెట్ల నడుమ హైద రాబాద్ లో....కొన్ని కీలక సన్నివేశాలను కుంభమేళాలోనూ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అవసరం మేర విదేశీ లొకేషన్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
యాక్షన్ పీక్స్ లో
ఈ నేపథ్యంలో సినిమాకు సంబధించి ఓ పవర్ పుల్ డైలాగ్ లీకైంది. ప్రత్యర్ధులపై `అఖండ` దాడి చేసే క్రమంలో బాలయ్య 'కదిలిపోయేది వాసాలు కాదు కూసాలు' అంటూ తెగబడుతాడట. ఆ యాక్షన్ సీన్ పీక్స్ లో స్టంట్ మాస్టర్లు డిజైన్ చేసారట. శరీర భాగాల్లో ప్రతీ బోన్ పార్ట్ కదిలిపోయేలా ఆ యాక్షన్ సీన్ ఉంటుందట. దాన్ని బేస్ చేసుకునే బోయపాటి రైటర్లతో 'వాసాలు కాదు కదిలిపోయేది కూసాలు' అనే డైలాగ్ రాయించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వస్తుందిట. మరి ఆ సంగతేంటో థియేటర్లోనే చూడాలి.
