Begin typing your search above and press return to search.

అఖండ 2 సైలెన్స్ వెనక రీజన్స్ ఏంటి..?

బాలయ్యతో యువ హీరోలైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ ఇద్దరు కూడా అఖండ 2 సినిమాపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   17 Dec 2025 12:20 PM IST
అఖండ 2 సైలెన్స్ వెనక రీజన్స్ ఏంటి..?
X

నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా గురించి చిత్ర యూనిట్ తప్ప మరో సెలబ్రిటీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా గురించి కాకపోయినా డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాను అనుకోని కారణాల వల్ల వాయిదా పడితే ఆ ఇష్యూ గురించి కూడా ఎవరు స్పందించలేదు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాండేజ్ లైన్ చెప్పాడు. సినిమా పరిశ్రమలో యూనిటీ లేదని అది కూడా చాలా సినిమాలకు పనిచేసే మ్యిఊజిక్ డైరెక్టర్ థమన్ నోటి నుంచి అలాంటి కామెంట్స్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేశాయి.

యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ..

ఐతే అఖండ 2 గురించి మిగతా వాళ్లు ఏమో కానీ బాలకృష్ణ అంటే ఇష్టం ఉన్న యువ హీరోలు కూడా కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదని ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు. బాలయ్యతో యువ హీరోలైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ ఇద్దరు కూడా అఖండ 2 సినిమాపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ విషయంపై నందమూరి ఫ్యాన్స్ ఆ యువ హీరోల మీద కూడా కాస్త గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది.

ఐతే సిద్ధు తెలుసు కదా సినిమా రిజల్ట్ డిజప్పాయింట్ చేసింది. ఆల్రెడీ జాక్ తో షాక్ తిన్న సిద్ధు తెలుసు కదా కూడా నిరాశపరచడంతో అతను తన కెరీర్ గురించి ఆలోచించే పనిలో ఉన్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం సితార బ్యానర్ లో ఒక సినిమా మరో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు సిద్ధు. ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 3, ఈ ఇయర్ లైలా మొత్తం 4 సినిమాలు చేసిన విశ్వక్ సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జస్ట్ ఓకే అనిపించినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.

కెరీర్ రిస్క్ లో ఉన్న ఈ టైం లో..

సో కెరీర్ రిస్క్ లో ఉన్న ఈ టైం లో మరో సినిమా గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో బహుశా విశ్వక్ సేన్ సైలెంట్ గా ఉండి ఉండొచ్చు. వీళ్లిద్దరే కాదు బాలకృష్ణ అంటే ఇష్టం ఉన్న వాళ్లు కూడా అఖండ 2 విషయంలో అసలు చప్పుడు చేయలేదు. సినిమా మీద జరుగుతున్న ఇష్యూపై కాకపోయినా సినిమా చూసి కాస్త పాజిటివ్ ట్వీట్ లేదా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ ని షేర్ చేసుకుంటే ఆడియన్స్ ని ఎంగేజ్ అయ్యేది. కానీ ఎవరు అలాంటి అటెంప్ట్ చేయలేదు.

అఖండ 2 సినిమా ఫైనల్ రన్ లో రిజల్ట్ ఏంటన్నది తెలుస్తుంది. క్రిస్ మస్ కి యువ హీరోల సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి ధాటికి బాలయ్య అఖండ 2 నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.