Begin typing your search above and press return to search.

అఖండ 'పెర్ఫెక్ట్' సీక్వెల్.. కానీ డౌట్ అంతా అక్కడే!

నటసింహం నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2: ది తాండవం మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Dec 2025 1:00 PM IST
అఖండ పెర్ఫెక్ట్ సీక్వెల్.. కానీ డౌట్ అంతా అక్కడే!
X

నటసింహం నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2: ది తాండవం మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా.. డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనుంది.

అయితే అఖండ ఓ రేంజ్ లో అందరినీ అలరించడంతో అఖండ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీక్వెల్ కూడా అదిరిపోతుందని అంతా భావిస్తున్నారు. దానికి తోడు.. మేకర్స్ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో సందడి చేస్తున్నారు. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. అందరి ఫోకస్ సినిమా వైపు తిప్పుకుంటున్నారనే చెప్పాలి.

అదే సమయంలో అఖండ సీక్వెల్ ను బోయపాటి శ్రీను పెర్ఫెక్ట్ గా రూపొందించారని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కామన్ ఆడియన్స్, నందమూరి అభిమానులు... ఎవరూ కూడా ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా తెరకెక్కించారని సమాచారం. స్క్రిప్ట్ తో పాటు మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని టాక్.

బాక్సాఫీస్ వద్ద భారీ కొట్టడమే టార్గెట్ గా తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం అందరికీ చిన్న డౌట్ ఉన్నట్లు మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే.. సీక్వెల్ విషయంలో ఫిమేల్ లీడ్ రోల్ ను ఛేంజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ కాగా.. సీక్వెల్ లో సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు.

అయితే తొలి భాగంలో ఐఏఎస్ అధికారిణిగా ప్రగ్యా అదరగొట్టేశారని చెప్పాలి. పవర్ ఫుల్ రోల్ లో నటించిన ఆమె.. తన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. బాలకృష్ణతో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంతా మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఏం జరుగుతుందోనని మాట్లాడుకుంటున్నారు.

హీరోయిన్ రోల్ విషయంలో ఎలా జస్టిఫై చేస్తారోనని డిస్కస్ చేసుకుంటున్నారు. బాలయ్య- సంయుక్త కెమిస్ట్రీ ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలని అంటున్నారు. అయితే బోయపాటి టాలెంట్ అందరికీ తెలిసిందే. మేకింగ్ అండ్ టేకింగ్ విషయంలో సరైన ప్లాన్ తోనే ముందుకు వెళ్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి హీరోయిన్ విషయంలో ఎక్కడా ఎలాంటి తేడా కనిపించకుండా తీశారని తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..