ఆ దేశంలో బాలయ్య శివ తాండవం
ఇప్పటికే ‘అఖండ 2’ షూటింగ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా, గోదావరి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్స్‌తో మొదలైంది.
By: Tupaki Desk | 30 April 2025 12:16 PMనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకుమించి ఈ సినిమా సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ సిద్ధమవుతోంది. ఈ భారీ యాక్షన్ సినిమాను సెప్టెంబర్ 25 దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయడానికి రెడీ అవుతోంది.
ఇప్పటికే ‘అఖండ 2’ షూటింగ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా, గోదావరి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్స్‌తో మొదలైంది. సినిమాలో బాలయ్యతో పాటు ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం, సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌తో సినిమా టెక్నికల్‌గా బలంగా ఉంటుందని టాక్. బాలయ్య అఘోరా రోల్ మళ్లీ హైలైట్ కానుంది.
అభిమానులు సినిమా టీజర్, ట్రైలర్ కోసం కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబోకు మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ‘అఖండ 2’ క్లైమాక్స్ ఎపిసోడ్ మే 12, 2025 నుంచి గ్రీస్‌లో షూట్ చేయనున్నారు. ఈ నెల రోజుల షెడ్యూల్‌లో బాలయ్య శివ తాండవంలా కనిపించనున్నాడని తెలుస్తోంది.
గ్రీస్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ హై-ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు గ్రాండ్ విజువల్ అప్పీల్ తెస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ క్లైమాక్స్ సినిమాలోనే హైలైట్ అవుతుందని, బాలయ్య ఎనర్జీ థియేటర్లలో జోష్ నింపుతుందని అంటున్నారు. గతంలో ‘అఖండ’ సినిమా క్లైమాక్స్‌ను తమిళనాడులోని ఓ టెంపుల్‌లో షూట్ చేశారు, అది ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది.
ఈసారి గ్రీస్‌లో జరిగే షూట్ మరింత గ్రాండ్‌గా ఉంటుందని టాక్. బోయపాటి శ్రీను మాస్ ఎలిమెంట్స్‌తో బాలయ్యను సరికొత్త లెవెల్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలతో ఈ కాంబినేషన్ అభిమానులను అలరించింది. ‘అఖండ 2’ కూడా అదే రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇక మే మొదటి వారంలో హీరో లేని టాకీ సీన్స్ షూట్ చేసి, మే 10 నుంచి బాలయ్యతో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 9 వరకు కొనసాగుతుంది. బాలయ్య బర్త్‌డే సమయానికి టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ టీజర్‌తో సినిమా హైప్ మరింత పెరుగుతుందని టీమ్ భావిస్తోంది.