Begin typing your search above and press return to search.

అఖండ 2 సునామీ.. ఈసారి ఊహించని బిజినెస్!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర ఖాయం.

By:  Tupaki Desk   |   28 Nov 2025 3:27 PM IST
అఖండ 2 సునామీ.. ఈసారి ఊహించని బిజినెస్!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర ఖాయం. సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ క్రేజీ కాంబో నుంచి వస్తున్న 'అఖండ 2: తాండవం'పై అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ హైప్ ఇప్పుడు బిజినెస్ లెక్కల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

'గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య ఈసారి లెక్కలన్నీ మార్చేశారు. అఖండ సినిమాతో హై రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య, ఇప్పుడు సీక్వెల్ తో అంతకు మించిన విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ. 250 కోట్ల మార్క్ ను టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. దీన్ని బట్టి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు రూ. 125 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు టాక్. నైజాం, సీడెడ్, ఆంధ్రా ప్రాంతాల్లో రైట్స్ కోసం బయ్యర్లు పోటీ పడ్డారు. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. డిజిటల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడైనట్లు టాక్. ఇది బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డు అని చెబుతున్నారు.

ఈ భారీ బిజినెస్ వెనుక ప్రధాన కారణం 'అఖండ' బ్రాండ్ ఇమేజ్. మొదటి భాగం డివోషనల్ టచ్ తో మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా, ఫ్యామిలీస్ ను కూడా థియేటర్లకు రప్పించింది. ఇప్పుడు సీక్వెల్ లో బాలయ్య మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుండటం, విజువల్స్ గ్రాండ్ గా ఉండటం సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. ముఖ్యంగా అఘోరా గెటప్ కు పాన్ ఇండియా రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.

డిసెంబర్ 5న 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీలో కూడా సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఫైనల్ గా రూ. 250 కోట్ల రికార్డు బిజినెస్ తో 'అఖండ 2' బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు ఫ్యాన్స్ హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ స్థాయి బిజినెస్ జరిగిందంటే, హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మరి మొదటి రోజు ఓపెనింగ్ లెక్కలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.