Begin typing your search above and press return to search.

ఒకే రోజు అఖండ-2, ఓజీ.. కానీ సమస్యంతా అక్కడే!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అఖండ-2, ఓజీ సినిమాలు.. ఒకే రోజు థియేటర్స్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 July 2025 10:38 AM IST
ఒకే రోజు అఖండ-2, ఓజీ.. కానీ సమస్యంతా అక్కడే!
X

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అఖండ-2, ఓజీ సినిమాలు.. ఒకే రోజు థియేటర్స్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాకు ప్రాఫిట్ సీజన్స్ లో ఒకటిగా ట్రీట్ చేసే దసరా సందర్భంగా రిలీజ్ అవ్వనున్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా విడుదల కానున్నాయి.

దీంతో దసరా పండక్కి బాక్సాఫీస్ వద్ద సంద‌డి మామూలుగా ఉండ‌ద‌ని చెప్పాలి. ఎందుకంటే రెండు సినిమాలు కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేవు. సైలెంట్ గా ఎవరి వర్క్స్ ను వారు కానిచ్చేస్తున్నారు. రిలీజ్ కు మూవీలను సిద్ధం చేస్తున్నారు. కచ్చితంగా అనుకున్న తేదీకి తమ సినిమాలు రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

అయితే ఇప్పటికే ఓజీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు మేకర్స్. అందుకే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అదే సమయంలో ఇప్పుడు అఖండ-2 షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఆగస్టు ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేయనున్నారని టాక్.

రీసెంట్ గా భద్రాచలంలో షూటింగ్ జరగ్గా.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కీలక అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబ‌రు 25న నంద‌మూరి అభిమానులు అస‌లైన ద‌స‌రా పండుగ చూస్తారంటూ ఆయ‌న భారీ ఉత్సాహాన్ని నింపేశారు. దీంతో అఖండ సీక్వెల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద హై ప్రొఫైల్ షో డౌన్ మాత్రం పక్కా.

అయితే రెండు సినిమాలను ప్రభావితం చేసే ఒక సమస్య ఉందని సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. భారీ హైప్ ఉన్న కాంతార ప్రీక్వెల్ సినిమాతో సవాల్ ఎదురవ్వనుందని అంటున్నారు. ఎందుకంటే కాంతార మూవీ అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లును రాబట్టి సందడి చేసింది.

ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ కాంతార ఛాప్టర్ 1.. అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానుంది. అంటే అఖండ-2, ఓజీ వచ్చిన వారం రోజుల్లోనే సందడి చేయనుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. పాజిటివ్ టాక్ వస్తే దూసుకుపోతోంది. అప్పుడు అఖండ సీక్వెల్, ఓజీ చిత్రాలకు సవాల్ ఎదురవుతుంది. థియేటర్ లభ్యత, కలెక్షన్లపై ఎఫెక్ట్ పడవచ్చు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.