బాలయ్య పంతం నెగ్గించుకున్నాడా?
అయితే 'అఖండ' సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్న బోయపాటి శ్రీనుకు, బాలయ్యకు ఇటీవల మనస్పర్థలు తలెత్తాయని, దానికి బోయపాటి క్రియేట్ చేసిన త్రిశూలం ఓ కారణమని ప్రచారం జరిగింది.
By: Tupaki Desk | 8 Jun 2025 11:36 AM ISTనందమూరి బాలకృష్ణ, మాసీవ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కలియికలో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'అఖండ'కు సీక్వెల్‌గా 'అఖండ 2' రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ మూవీని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తమీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుంచి రాకెట్ వేగంతో ఈమూవీ షూటింగ్ ని దర్శకుడు బోయపాటి శ్రీను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంత వరకు వరుస ఫ్లాపులని ఎదుర్కోవడంతో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో ఈ మూవీ షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఆదిపినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీలోనూ బాలయ్య అఘోరగా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
అయితే 'అఖండ' సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్న బోయపాటి శ్రీనుకు, బాలయ్యకు ఇటీవల మనస్పర్థలు తలెత్తాయని, దానికి బోయపాటి క్రియేట్ చేసిన త్రిశూలం ఓ కారణమని ప్రచారం జరిగింది. 'అఖండ'లో బాలయ్య ఆయుధం త్రిశూలం. అలాగే సీక్వెల్‌లోనూ అదే ఆయుధాన్ని తిరిగి వాడాలనుకున్నారు. కానీ బోయపాటి దానికి కొన్ని మార్పులు చేసి త్రిశూలం పై భాగంతో చిన్నపాటి గదను ఏర్పాటు చేయించారట.
దాన్ని చూసిన బాలయ్య తాను పురాణాల్లో ఇలాంటి త్రిశూలాన్ని ఎక్కడా చూడలేదని పెదవి విరిచారట. దానికి బోయపాటి ఇలాంటి ఆయుధం ఉందని, సినిమాలో ఇలాగే ఉంటుందని చెప్పడంతో బాలయ్య ఫీలయ్యారట. ఇదేంటీ ఇలా చేస్తున్నాడని నొచ్చుకున్నారని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మేకర్స్ ఆదివారం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. బాలయ్య పుట్టిన రోజు జూన్ 10 ఈ సందర్భాన్ని 'అఖండ2' టీమ్ ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేయబోతోంది.
ఈ విషయాన్నే వెల్లడిస్తూ ఆదివారం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో త్రిశూలం అందరిదృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారింది. నంది తలతో త్రిశూలాన్ని డిజైన్ చేసిన తీరు.. మధ్యలో శివుడి మూడవ కన్నుని తలపిస్తూ డిజైన్ చేయడం ఆకట్టుకుంటోంది. గతంలో త్రిశూలంపై గదని డిజైన్ చేయించిన బోయపాటి హీరో బాలయ్య కారణంగా ఆ ఆలోచనను పక్కన పెట్టి తాజా శూలాన్ని డిజైన్ చేయించాడని, దీంతో బాలయ్య తన పంతం నెగ్గించుకున్నాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
