Begin typing your search above and press return to search.

బోయ‌పాటి డెడికేష‌న్‌కు ఫ్యాన్స్ ఫిదా

భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

By:  Tupaki Desk   |   25 April 2025 6:30 AM
బోయ‌పాటి డెడికేష‌న్‌కు ఫ్యాన్స్ ఫిదా
X

టాలీవుడ్ లో ఉండే డైరెక్ట‌ర్, హీరో కాంబినేష‌న్ల‌లో బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ స్పెష‌ల్. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి హిట్లుగా నిలిచాయి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేస్తున్నారు. అదే అఖండ‌2 తాండ‌వం. బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా బోయ‌పాటి దీన్ని రూపొందిస్తున్నాడు.

భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను అఖండ‌2 నెక్ట్స్ షెడ్యూల్ కోసం జార్జియాలో లొకేష‌న్స్ ను వెతుకుతున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ ను చిత్ర యూనిట్ షూట్ చేయ‌గా, జార్జియాలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో మ‌రికొన్ని భారీ యాక్ష‌న్ సీన్స్ తో పాటూ, ఇంకొన్ని సీన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అఖండ‌2 కోసం లొకేష‌న్స్ ను వెతికే క్ర‌మంలో జార్జియాలో ఉన్న బోయ‌పాటి శ్రీను త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కోసం కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వ‌ర్క్ చేస్తున్నాడు. త‌న పుట్టిన రోజును కూడా బోయ‌పాటి చిత్ర యూనిట్ తోనే జ‌రుపుకుంటూ, సినిమాపై ఎంతో డెడికేష‌న్ తో వ‌ర్క్ చేస్తుండ‌టం మేక‌ర్స్ ను ఎంతో సంతోష‌ప‌రుస్తుంది.

మామూలుగా అయితే బోయ‌పాటి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ఇలాంటి లొకేష‌న్ల రెక్కీకి వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. త‌న చిత్ర యూనిట్ తో ఈ రెక్కీని చేయించి నేరుగా న‌చ్చిన లొకేష‌న్‌లో షూటింగ్ కు వెళ్లొచ్చు. కానీ బోయ‌పాటి మాత్రం త‌న టీమ్ ను పంప‌కుండా డైరెక్ట్ గా త‌నే వెళ్లి లొకేష‌న్స్ ను వెతక‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ సినిమాతో ఆడియ‌న్స్ కు నెవ‌ర్ బిఫోర్ ఎక్స్‌పీరియెన్స్ అందించాల‌నే ఉద్దేశంతోనే బోయ‌పాటి ఈ రెక్కీని స్వ‌యంగా తానే నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌గ్యా జైస్వాల్, సంయుక్త మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. 14రీల్స్ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో రామ్ ఆచంట‌, గోపీ ఆచంట ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను బాల‌య్య చిన్న కూతురు ఎం. తేజ‌స్విని స‌మ‌ర్పిస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.