Begin typing your search above and press return to search.

అఖండ 2.. అంతా సజావుగా సాగుతోందా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన 'సింహా', 'లెజెండ్‌', 'అఖండ' సినిమాలు భారీ విజయాన్నిసొంతం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   10 April 2025 9:19 AM
అఖండ 2.. అంతా సజావుగా సాగుతోందా?
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన 'సింహా', 'లెజెండ్‌', 'అఖండ' సినిమాలు భారీ విజయాన్నిసొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అఖండ ఆకట్టుకుంది. థియేట్రికల్‌ రిలీజ్‌లో కంటే ఓటీటీలో అఖండ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అఖండ 2 సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా అఖండ 2. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. చివరి రెండు షెడ్యూల్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఒక షెడ్యూల్‌ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను మధ్య చిన్న విషయంలో గొడవ జరిగిందని, ఇద్దరి మధ్య ప్రస్తుతం మాటలు లేవు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ పుకార్లు పూర్తిగా అవాస్తవం. బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడికి పూర్తిగా సరెండర్‌ అయ్యి సినిమాను చేసే హీరో. పైగా తనకు మూడు హిట్స్ ఇచ్చిన దర్శకుడు కావడంతో బోయపాటి శ్రీను విషయంలో కచ్చితంగా బాలకృష్ణ కు ఎలాంటి అనుమానం ఉండదు. కనుక సోషల్‌ మీడియాలో అఖండ 2 గురించి జరుగుతున్న ప్రచారం మొత్తం పుకార్లే అని, అస్సలు నమ్మవద్దు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ దర్శకుడు ఏం చెబితే అది చేసేందుకు రెడీగా ఉంటాడు. ఒక సారి కథ విని, స్క్రిప్ట్‌ ఫైనల్ అయిన తర్వాత కొందరు హీరోలు ఇన్వాల్వ్‌ అవుతారని, వేలు పెడతారని టాక్ వింటూ ఉంటాం. కానీ బాలకృష్ణ విషయంలో అలా ఎప్పుడూ జరగదు. బాలకృష్ణ ఒకసారి కమిట్‌ అయ్యాడు అంటే ఆ సినిమా ఫలితంపై నమ్మకం లేకున్నా ముందుకు వెళ్తాడు. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తాడు. అంతే తప్ప విభేదాలు, గొడవలు ఉండవు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పుకార్లు బాలకృష్ణ గురించి రాలేదు. మొదటి సారి ఇలాంటి పుకార్లు రావడం తో కొందరు ఫ్యాన్స్ సైతం ఈ విషయమై ఆలోచనలో పడ్డారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం పుకార్లను కొట్టి పారేశారు.

బాలకృష్ణ 2025 సంక్రాంతికి 'డాకు మహారాజ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అఖండ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుని, ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకున్నాడు. డాకు మహారాజ్ సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌ నమోదు చేయలేదనే టాక్‌ వినిపిస్తుంది. కానీ సినిమా ఓవరాల్‌గా విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. అఖండ 2 సినిమాను 14 రీల్స్ బ్యానర్‌లో నిర్మిస్తూ ఉండగా, తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య సినిమాలకు వరుసగా ఐదో సారి తమన్‌ వర్క్ చేస్తున్నాడు. వీరి కాంబోకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరో విజయం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.