అఘోర నుంచి బాలయ్య రియల్ లుక్ లోకి!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడి బోయపాటి దర్శకత్వంలో `అఖండ-2` శివతాండవం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 April 2025 3:30 PMనటసింహ బాలకృష్ణ కథానాయకుడి బోయపాటి దర్శకత్వంలో `అఖండ-2` శివతాండవం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ప్రారంభమైన దగ్గర నుంచి టీమ్ నిర్విరామంగా పనిచేస్తొంది. ప్రయాగ్ రాజ్ కుంభమేళా లాంటి ఎగ్జోటిక్ లోకేషన్లనూ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో బాలయ్య ద్విపాత్రా భినయం చేస్తున్నారు. `అఖండ`లో హైలైట్ అయిన అఘోర పాత్ర అసలు రూపం రెండవ భాగంలో చూపించబోతున్నారు.
దీనిలో భాగంగా కుంభమేళాలో చిత్రీకరించిన అఘోర సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించి మరింత అప్ డేట్ అందింది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి బాలయ్య పై కేవలం అఘోర పాత్రకు సంబంధించిన సన్నివేశాలే ఇప్పటి వరకూ చిత్రీకరించారుట. తాజాగా అఘోర పాత్రకు సంబంధించి టాకీ అంతా పూర్తయిందని సమాచారం.
తదుపరి షెడ్యూల్ లో బాలయ్య రెండవ పాత్రకు సంబంధించిన షూట్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన షూటింగ్ మాత్రం ఎక్కువ భాగం హైదరాబాద్ లో నే ఉంటుందిట. ఔట్ డోర్ షూటింగ్ పెద్దగా ఉండదని...అవసరం మేర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సెట్లు వేసి పూర్తి చేస్తారని సమాచారం. అయితే టాకీ ఎంత శాతం పూర్తయింది? అన్నది మాత్రం క్లారిటీ లేదు.
కానీ చిత్రీకరణ మాత్రం జూన్ నెలఖరుకల్లా మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని బోయ పాటి భావిస్తున్నాడుట. ఇప్పటికే సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే షూటింగ్ ప్లాన్ చేసుకుని ముగిస్తున్నారు. థమన్ కూడా ఇప్పటికే తన పూర్తి చేసాడు. పాట లకు సంబంధించిన చిత్రీకరణ కూడా త్వరలోనే మొదలవుతుందని సమాచారం.