Begin typing your search above and press return to search.

బాలయ్య 'అఖండ 2' ఏప్రిల్‌ అప్‌డేట్‌..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'అఖండ 2'.

By:  Tupaki Desk   |   13 April 2025 10:30 AM
బాలయ్య అఖండ 2 ఏప్రిల్‌ అప్‌డేట్‌..!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'అఖండ 2'. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అఖండ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ కాంబోకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సమయంలోనే సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే సీక్వెల్ కాస్త ఆలస్యం అయింది. భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌ సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో అఖండ 2 సినిమా సైతం ఆలస్యం అయిన విషయం తెల్సిందే. అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

బోయపాటి ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేశాడట. ముఖ్యంగా అఘోరాల గురించి చాలా విషయాలను తెలుసుకున్నాడట. అంతే కాకుండా బాలయ్యను అఘోరా పాత్రలో చూపించడం కోసం చాలా లుక్ టెస్ట్‌లు చేసి చివరకు ఈ లుక్‌ను ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాలోనూ బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి అఘోరాగా కనిపించే పాత్ర. మొదటి పార్ట్‌లో అఘోర పాత్ర హైలైట్‌గా నిలిచింది. సెకండ్‌ పార్ట్‌లోనూ అదే స్థాయిలో ఆ పాత్ర ఉంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 ఇంటర్వెల్‌ సీన్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సినిమా గురించి చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. నిన్న మొన్నటి వరకు దర్శకుడు బోయపాటి శ్రీను వర్క్ విషయమై బోయపాటి అసంతృప్తితో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదని, ఇద్దరు ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు కనుక ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు. కనుక విభేదాలు అనేవి కచ్చితంగా ఉండవు అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ పుకార్లను కొట్టి పారేసిన విషయం తెల్సిందే. అఖండ 2 సినిమా ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ఆఫ్‌ ది రికార్డ్‌ చెప్పుకొచ్చారు.

ఏప్రిల్‌ రెండో వారం నుంచి అఖండ 2 సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ను భారీ సెట్‌లో చేయాలని భావించారు. కానీ సెట్ నిర్మాణం విషయంలో జాప్యం కావడంతో వారం రోజుల ఆలస్యంగా అంటే ఏప్రిల్‌ మూడో వారంలో యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ స్టంట్స్ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్ ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యాక్షన్‌ సన్నివేశాలు ఇంటర్వెల్‌ కి ముందు వస్తాయట. ఈ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమా ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకు వెళ్లబోతున్నట్లు దర్శకుడు ఇంటర్వెల్ సమయంలో క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. అఖండ 2 సినిమా గురించి ఈమధ్య కాలంలో రెగ్యులర్‌గా అంచనాలు పెంచే విధంగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఏప్రిల్‌ నెల అప్డేట్‌ విషయానికి వస్తే ఇంటర్వెల్‌ కి ముందు వచ్చే యాక్షన్‌ సన్నివేశం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.