Begin typing your search above and press return to search.

హీరోను చంపేందుకు సుపారీ.. వ్యక్తి అరెస్ట్‌

వెంటనే స్పందించిన పోలీసులు విచారణ జరిపి అది ఫేక్ కాల్‌ అని నిర్ధారణకు వచ్చారు. ఖార్‌ పోలీస్‌ స్టేషన్ అధికారులు కాల్‌ను ట్రేస్ చేసి ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 5:28 PM IST
Fake Threat Calls Rattle Bollywood Tiger Shroff
X

బాలీవుడ్‌ను ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మరో వైపు ఫేక్‌ కాల్స్, బెదిరింపు మెసేజ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు ఆకతాయిలు సైతం లారెన్స్ బిష్ణోయ్‌ పేరుతో కాల్స్ చేయడం, మెసేజ్‌లు చేయడంతో ఆందోళన మరింత ఎక్కువ అవుతోందట. ముంబై పోలీసులు ఈ విషయమై చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌కి ప్రాణ హాని ఉంది అంటూ ఒక వ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. టైగర్‌ ష్రాఫ్‌ ను చంపేందుకు గాను రూ.2 లక్షల సుపారీ సైతం ఒక గ్యాంగ్‌ అందుకుందని, ష్రాఫ్‌ ను హత్య చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అతడు కంట్రోల్‌ రూంకి ఫోన్ చేసి చెప్పాడు.

వెంటనే స్పందించిన పోలీసులు విచారణ జరిపి అది ఫేక్ కాల్‌ అని నిర్ధారణకు వచ్చారు. ఖార్‌ పోలీస్‌ స్టేషన్ అధికారులు కాల్‌ను ట్రేస్ చేసి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. టైగర్‌ ష్రాఫ్‌ హత్య గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తిని మనీష్ కుమార్‌ గా గుర్తించారు. అతడు తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు గాను అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ముంబైలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు కచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు చాలా స్పీడ్‌గా కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

పంజాబ్‌కు చెందిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులుగా చెప్పుకున్నారు. అయితే ఇలాంటి ఫేక్‌ కాల్స్‌ వస్తున్న నేపథ్యంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులు చేస్తున్న కాల్స్‌ను మరింత లోతుగా ఎంక్వరీ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారట. ఇటీవలే బాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ఒక వ్యక్తి చంపేస్తాం అంటూ మెసేజ్ చేశాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కేసు సైతం విచారణ జరుగుతున్న విషయం తెల్సిందే.

సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేస్తామంటూ హెచ్చరించిన వ్యక్తి మతి స్థిమితం సరిగా లేదు అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా ఈ ఫేక్ కాల్స్‌, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. హీరోను చంపేందుకు సుపారీ ఇచ్చారు అంటూ అతడు చెప్పిన విషయం గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ముందు ముందు ఇలాంటివి మరెన్ని వినాల్సి వస్తుందో అని బాలీవుడ్‌ ఫిల్మ్‌ స్టార్స్‌, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.