Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ లో ఆకాశ్ పూరి!

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ తెలిసింది. ఇందులో ఆకాశ్ పూరి కూడా ఓ చిన్న పాత్ర పోషిస్తున్న‌ట్లు లీకైంది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:12 AM GMT
డబుల్ ఇస్మార్ట్ లో ఆకాశ్ పూరి!
X

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాధ్ 'డ‌బుల్ ఇస్మార్ట్' తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంక‌ర్' కి సీక్వెల్ గా రూపొందుతుంది. ఇంత‌వ‌ర‌కూ పూరి సీక్వెల్స్ చేసింది లేదు. ఎప్పుడు ప్రెష్ కంటెంట్ తోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. కానీ ఇప్పుడాయ‌న రూట్ కాస్త డైవర్ట్ అయింది. ఎవ‌రైనా క‌థ‌లిస్తే తీసుకోవడం కూడా ప్రారంభించారు. కొత్త గా అనిపించే క‌థ‌ల్ని కొని పెడుతున్నారు. 'టెంప‌ర్' సినిమా అలా చేసిందే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే 'ఇస్మార్ట్ శంక‌ర్' మాత్రం పూరి సొంత క‌థ‌నే.

హిట్ సినిమాకి సీక్వెల్ కావ‌డ‌తో కంటెంట్ పై చాలా ధీమాగా ఉన్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. పూరి స్టైల్లో చుట్టేస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని షెడ్యూల్స్ పూర్త్య‌య్యాయి. తాజా షెడ్యూల్ కూడా అంతే వేగంగా జ‌రుగుతోంది. సినిమాపై అభిమానుల్లో అంచ‌నాలు కూడా బాగానే ఉన్నాయి. హిట్ సినిమాకి సీక్వెల్ కావ‌డంతో తెలంగాణ అభిమానులు మ‌రింత క్యూరియ‌స్ గా ఎదురు చూస్తున్నారు. క‌థ అక్క‌డి నేప‌థ్యాన్ని ముడిపెట్టుకోవ‌డమే ఈ ఆస‌క్తి కి కార‌ణం.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ తెలిసింది. ఇందులో ఆకాశ్ పూరి కూడా ఓ చిన్న పాత్ర పోషిస్తున్న‌ట్లు లీకైంది. అది ప‌క్కా తెలంగాణ యాస‌భాష‌లో ఉండే రోల్ అట‌. ఆ పాత్ర‌కి ఓ ప్ర‌త్యేక‌త ఉంద‌ని అంటున్నారు. ఈ రోల్ కూడా ఆకాష్ కాస్త స‌న్న‌గానూ త‌యార‌య్యాడుట‌. హైద‌రాబాద్ గ‌ల్లీలో సెటిల్మెంట్ చేసే ఓ గ్యాంగ్ కి లీడ‌ర్ రోల్ అట. ఆ పాత్ర‌లో ర‌క‌ర‌కాల వేరియేషన్స్ ఇవ్వ‌నున్నాడు. సీరియ‌స్ నెస్ తో పాటు అందులో ఫ‌న్ కూడా ఉంటుందిట‌. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంతో తెలియాలి.

ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసాడు. పూరి సినిమాల్లో హీరోల చైల్డ్ పాత్ర‌ల‌న్ని ఆకాశ్ పోషించేవాడు. పెద్దైన త‌ర్వాత మాత్రం 'మెహ‌బూబ' అనే సినిమా చేసాడు. అప్ప‌టికే హీరోగా ఎదిగే ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టాడు. చివ‌రిగా 'చోర్ బ‌జార్' లో న‌టించాడు. కానీ ఆకాశ్ కి ఇంకా స‌రైన బ్రేక్ రాలేదు. దీంతో అవ‌కాశాల‌కు దూర‌మ‌వుతున్నాడు. ఈ నేప‌థ్యంలో డాడ్ సినిమాలో న‌టిస్తున్నాడు? అన్న వార్త అభిమానుల్లో ఆస‌క్తిగా మారింది.