Begin typing your search above and press return to search.

గాళ్స్ గ్యాంగ్‌తో క‌పూర్ లేడీ రచ్చ‌

త‌న స‌ల‌హా మేర‌కు ఇంత‌కుముందు ఆకాంక్ష ఓ తెలుగు సినిమాకి సంత‌కం చేసాన‌ని తెలిపింది. సందీప్ కిష‌న్ స‌ర‌స‌న మాయా వ‌న్ అనే చిత్రంలో న‌టించింది

By:  Tupaki Desk   |   22 April 2024 5:02 PM GMT
గాళ్స్ గ్యాంగ్‌తో క‌పూర్ లేడీ రచ్చ‌
X

న‌ట‌వార‌సులంతా సౌత్ పై క‌న్నేశార‌ని, అక్క‌డ వారంతా బాగా రాణిస్తున్నార‌ని, అందుకే తాను కూడా సౌత్ సినిమాల్లో న‌టించాల‌ని ముందుకు వ‌చ్చాన‌ని తెలిపింది ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్. అన‌న్య పాండే, జాన్వీ క‌పూర్, ఆలియాభ‌ట్ లాంటి భామ‌లు బాలీవుడ్ లో న‌టించి, అటుపై తెలుగు చిత్ర‌సీమ‌లోను అడుగుపెట్టారు. త‌న క్లోజ్ ఫ్రెండ్ ఆలియా భ‌ట్ ఆర్.ఆర్.ఆర్ లో న‌టించింది. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో మంచి పేరు తెచ్చుకుంది. త‌న స‌ల‌హా మేర‌కు ఇంత‌కుముందు ఆకాంక్ష ఓ తెలుగు సినిమాకి సంత‌కం చేసాన‌ని తెలిపింది. సందీప్ కిష‌న్ స‌ర‌స‌న మాయా వ‌న్ అనే చిత్రంలో న‌టించింది.

ఆకాంక్ష‌ 2020 నెట్‌ఫ్లిక్స్ ఇండియా చిత్రం `గిల్టీ`తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2021 వెబ్ సిరీస్ రే .. 2022 నెట్‌ఫ్లిక్స్ ఇండియా చిత్రం మోనికా `ఓ మై డార్లింగ్‌`లో నటించింది. 2017 చిత్రం మాయవన్ సీక్వెల్ లోను న‌టించింది. గత మూడు సంవత్సరాలలో ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్ జీవితం ఏమైనా మారిందా? అని ప్ర‌శ్నించ‌గా.. ఒక విధంగా, ఏమీ లేదు అని తెలిపింది. నా స్నేహితులు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, కృషి అలాగే ఉంటాయి. కాబట్టి, ఆ కోణంలో ఏమీ మారలేదు. కానీ నా కెరీర్‌లో ఇంత పెద్ద మైలురాళ్ళు ఉన్నాయి. అయితే నా లైఫ్ లో ప్రతిదీ మారిపోయింది. నేను చివరకు ఎప్పుడూ కలలుగన్న జీవితాన్ని గడుపుతున్నాను. నేను కూడా పెద్ద తెరపై అరంగేట్రం చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది అని తెలిపింది.

మ‌రోవైపు ఆకాంక్ష రాంజ‌న్ కి సోష‌ల్ మీడియాల్లోను ఫాలోయింగ్ పెరుగుతోంది. న‌టించింది త‌క్కువ సినిమాల్లో అయినా త‌న‌కు ఆన్ లైన్ మాధ్య‌మాల్లో అనుచ‌రులు అమాంతం పెరిగారు. వారి కోసం నిరంత‌రం ఆకాంక్ష ఏదో ఒక స్పెష‌ల్ ట్రీట్ ని ప్లాన్ చేస్తూనే ఉంది. తాజాగా త‌న గాళ్స్ గ్యాంగ్ తో చిలౌట్ చేసిన ఫోటోల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. ``మ‌ళ్లీ వీధుల్లోకి తిరిగి వ‌చ్చాను...`` అంటూ గాళ్స్ గ్యాంగ్ తో ర‌చ్చ చేస్తున్న ఫోటోలను ఆకాంక్ష షేర్ చేసింది.