Begin typing your search above and press return to search.

కెల్విన్ క్లెయిన్ ఇన్న‌ర్‌తో రెచ్చిపోయిన బ్యూటీ

క‌పూర్ గాళ్స్ అనగానే సోన‌మ్ క‌పూర్, జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ అంటూ కొంద‌రు గుర్తుకు వ‌స్తారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:00 AM GMT
కెల్విన్ క్లెయిన్ ఇన్న‌ర్‌తో రెచ్చిపోయిన బ్యూటీ
X

క‌పూర్ గాళ్స్ అనగానే సోన‌మ్ క‌పూర్, జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ అంటూ కొంద‌రు గుర్తుకు వ‌స్తారు. కానీ బాలీవుడ్ లో క‌పూర్‌ల కుటుంబంతో సంబంధం లేకుండానే మ‌రో క‌పూర్ గాళ్ న‌టిగా రాణిస్తోంది. ఫ్యాష‌న్ అండ్ మోడ‌లింగ్ ప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర వేసిన ఈ బ్యూటీ భ‌విష్య‌త్ లో పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లు గంటోంది. ఇక ఆకాంక్ష సోష‌ల్ మీడియా పోస్టుల‌కు భారీ ఫాలోయింగ్ ఉంది.


ఆకాంక్ష‌ రంజన్ కపూర్ బాలీవుడ్ లో అప్ క‌మింగ్ స్టార్. గిల్టీ (2020) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆరంగేట్ర‌మే ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డుల నామినేషన్‌ను అందుకుంది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రే (2021)తో ఓటీటీ రంగంలోకి ప్రవేశించింది. ఆకాంక్ష తండ్రి శశి రంజన్ FTII నుండి శిక్ష‌ణ పొందిన నటుడు, దర్శకుడు. GR8 మ్యాగజైన్ పబ్లిషర్ కూడా. ఆకాంక్ష త‌ల్లిగారు 'ది ఇండియన్ టెలివిజన్ అకాడమీ' వ్యవస్థాపకురాలు. అనుష్క రంజన్ అనే అక్క ఉంది. త‌ను కూడా నటి. జమ్నాబాయి నర్సీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆకాన్షా విస్లింగ్ వుడ్స్ నుండి యాక్టింగ్ డిప్లొమాను అభ్యసించింది.


ఆకాంక్ష కపూర్ తన కెరీర్‌ను 2019లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్ TLC డీకోడెడ్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత 'తేరే దో నైనా' అనే మ్యూజిక్ వీడియోలో అపరశక్తి ఖురానాతో కలిసి కనిపించింది. 2020లో నెట్‌ఫ్లిక్స్ చిత్రం గిల్టీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో అత్యాచార బాధితురాలిగా కనిపించింది. ఆకాంక్ష‌ నటనకు ఉత్తమ సహాయ నటి (మహిళ)గా నామినేషన్ ద‌క్కించుకుంది. తర్వాత 2021 నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రేతో తన వెబ్ ప్ర‌పంచంలోకి ప్రవేశించింది. ఈ సిరీస్‌లో హర్షవర్ధన్ కపూర్ సరసన కనిపించింది. ఆమె తదుపరి సంగీత వీడియో 'హమ్ హి హమ్ దే'లో ఆషిమ్ గులాటీతో కలిసి కనిపించింది. ఆ తర్వాత రాజ్‌కుమార్ రావ్, రాధికా ఆప్టే మరియు హుమా ఖురేషీలతో కలిసి 'మోనికా, ఓ మై డార్లింగ్‌'లో కనిపించింది. ఆకాంక్ష న‌టించిన రెండ‌వ చిత్ర‌మిది. ఇది విమర్శకులు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆకాంక్ష న‌టిగా షైన్ అయింది. తనకంటూ ఓ ప్రత్యేక మార్గాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకాంక్ష హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ప్ర‌స్తుతం మాయా వ‌న్ అనే చిత్రంలో న‌టిస్తోంది.

ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్ కి ఇండ‌స్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రు? అంటే ది గ్రేట్ ఆలియా భ‌ట్. ట్యాలెంటెడ్ ఆలియాకు ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్ - అనుష్క రాంజ‌న్ క‌పూర్ సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ ఎంతో క్లోజ్. చిన్న‌ప్ప‌టి నుంచి ఆ ముగ్గురి న‌డుమా మంచి బాండింగ్ ఉంది. చాలా వేడుక‌ల్లో ఆ ముగ్గురూ క‌లిసి క‌నిపించారు. ఇక ఆకాంక్ష రాంజ‌న్ లేటెస్ట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. తాజాగా కెల్విన్ క్లెయిన్ ప్ర‌మోష‌న‌ల్ స్టింట్ కి సంబంధించిన ఆకాంక్ష స్టిల్ ఒక‌టి వెబ్ ని షేక్ చేస్తోంది.