Begin typing your search above and press return to search.

ఆకాంక్ష సింగ్ రొమాంటిక్ పాత్ర‌లు చేయ‌దా?

అయితే తెలుగులో మాత్రం అమ్మ‌డికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. తొలి సినిమా స‌క్సెస్ అనంత‌రం స్టార్ లీగ్ లో వేగంగానే చేరుతుంద‌ని భావించినా అలా జ‌ర‌గ‌లేదు.

By:  Tupaki Desk   |   22 May 2025 4:23 AM
ఆకాంక్ష సింగ్  రొమాంటిక్ పాత్ర‌లు చేయ‌దా?
X

'మ‌ళ్లీ రావే' అనే బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీతో ప‌రిచ‌య‌మైంది ఆకాంక్ష సింగ్. తొలి సినిమాతోనే అమ్మ‌డు ట్యాలెంటెడ్ బ్యూటీగా ప్రూవ్ అయింది. రేర్ పెర్పార్మ‌ర్ గా గుర్తింపు ద‌క్కించుకుంది. ఆకాంక్ష సింగ్ అందం..అభిన‌యం బాగా క‌లిసొచ్చాయి. తొలి సినిమా మంచి విజ‌యం సాధించింది. అటుపై దేవ‌దాస్ చిత్రంలో ఛాన్స్ అందుకుంది. క్లాప్, శివుడు అనే మ‌రో రెండు సినిమాలు కూడా చేసింది. మ‌ధ్య‌లో త‌మిళం, హిందీ సినిమాలకు ప‌నిచేసింది.

అయితే తెలుగులో మాత్రం అమ్మ‌డికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. తొలి సినిమా స‌క్సెస్ అనంత‌రం స్టార్ లీగ్ లో వేగంగానే చేరుతుంద‌ని భావించినా అలా జ‌ర‌గ‌లేదు. మ‌ళ్లీ మూడేళ్ల‌కు ష‌ష్టిపూర్తి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవువుతంది. ఇందులో డీసెంట్ పాత్ర‌లో క‌నిపించ బోతుంది. సినిమాపై చాలా కాన్పిడెంట్ గా ఉంది. కానీ ఆకాంక్ష నుంచి ప్రేక్ష‌కులు కోరుకునేది ఇంతే కాదు.

ఆమె ప్ర‌తిభ‌కు త‌గ్గ అవ‌కాశాలు రాలేద‌ని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఇలా ఎందుకు జ‌రుగుతుందంటే? ఆకాంక్ష సింగ్ కండీష‌న్లు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. అమ్మ‌డు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటుంది. రొమాంటిక్ స‌న్నివేశాలంటే అంగీక‌రించ‌దు. పెదవి ముద్దులు.. .ఇంటి మేట్ సీన్స్ అంటే నో ఛాన్స్ అంటుంది. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లు మాత్ర‌మే చూజ్ చేసుకుం టుంది.

ఈ క్ర‌మంలో చాలా అవ‌కాశాలు కోల్పోయింది. ఈ నిబంధ‌న కేవ‌లం టాలీవుడ్ కి మాత్ర‌మే కాదు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఇలాగే కొన‌సాగుతుంది. త‌మిళం, హిందీలో కూడా సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో సైతం డీసెంట్ పాత్ర‌లే చేసింది. ఎలాంటి రొమాంటిక్ పాత్ర‌ల‌కు ఎస్ చెప్పిన‌ట్లు వాటిలో ఎక్క‌డా క‌ని పించ‌లేదు. మ‌రి పాత్ర‌ల విష‌యంలో ఎందుకంత కఠినంగా ఉంటుందంటే? ఇండస్ట్రీకి వ‌చ్చే ముందు చాలా నియ మాలు విధించుకుని వ‌చ్చింది.

త‌న కుటుంబీక‌ల‌కు సంబంధించిన ఓ స్పెష‌ల్ ట్యాగ్ కూడా ఆమెపై బ‌లంగా ప‌నిచేస్తుంద‌ని ఆమె మేనేజ‌ర్ వర్గాల నుంచి తెలిసింది. తాజా సినిమా 'ష‌ష్టిపూర్తి' ఫ్యామిలీతో కూర్చుని చూసే సినిమా అని...ఎమోష‌నల్ గా క‌నెక్ట్ అయ్యే చిత్ర‌మ‌ని తెలిపింది.