Begin typing your search above and press return to search.

ఆ హీరోకు కూడా 125 కోట్లు ఇస్తున్నారా?

కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అజిత్ కుమార్. అందరూ తలా అజిత్ గా అతనిని పిలుచుకుంటారు

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:47 AM GMT
ఆ హీరోకు కూడా 125 కోట్లు ఇస్తున్నారా?
X

కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అజిత్ కుమార్. అందరూ తలా అజిత్ గా అతనిని పిలుచుకుంటారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో దళపతి విజయ్, అజిత్ ల మధ్య సినిమాల పరంగా గట్టి పోటీ పరుస్తోంది. ఫ్యాన్స్ కూడా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో గొడవ పడతారు. అజిత్ తన వయస్సుకి సరిపోయే పాత్రలని ఎంపిక చేసుకుంటూ మూవీస్ చేస్తున్నారు.


కమర్షియల్ జోనర్ సినిమాలు చేసిన కచ్చితంగా కథనం సర్ప్రైజింగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అజిత్ కెరియర్ లో ఈ మధ్యకాలంలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాదిలో వచ్చిన తునివు మూవీ కూడా హిట్ అయ్యింది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇదిలా ఉంటే అజిత్ ప్రస్తుతం విడముయార్చి అనే మూవీ చేస్తున్నారు.

మగిజ్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా అజర్బైజాన్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అజిత్ కి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే అజయ్ కెరియర్ లో ప్రతిష్టాత్మకమైన 150వ సినిమాకి రంగం సిద్ధమైపోతుంది.

మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రూవ్ చేసుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఏకే 63 టైటిల్ ఈ చిత్రానికి అప్పుడే నిర్ణయించేశారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ లో ఎలర్డ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వెట్రిమారన్ తో ఇతను చివరిగా విచారణై సిరీస్ చేశారు. ఇవి ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.

వీటి తర్వాత ఎలర్డ్ కుమార్ చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి గాను నిర్మాత ఏకంగా 125 కోట్ల రెమ్యునరేషన్ అజిత్ కి ఆఫర్ చేసారంట. ఒక వేళ ఈ రెమ్యునరేషన్ అందుకుంటే మాత్రం ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా అజిత్ మారిపోతాడు.