Begin typing your search above and press return to search.

ఈ జోడీ సూప‌ర్బ్..ఇద్ద‌రికీ 52!

52 ఏళ్ల వ‌య‌సున్న హీరోకి అదే వ‌య‌సున్న హీరోయిన్ ని ఎంపిక చేయ‌డం అన్న‌ది ఏ ఇండ‌స్ట్రీలోనూ జ‌ర‌గ‌దు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 3:30 PM GMT
ఈ జోడీ సూప‌ర్బ్..ఇద్ద‌రికీ 52!
X

52 ఏళ్ల వ‌య‌సున్న హీరోకి అదే వ‌య‌సున్న హీరోయిన్ ని ఎంపిక చేయ‌డం అన్న‌ది ఏ ఇండ‌స్ట్రీలోనూ జ‌ర‌గ‌దు. ఎందుకంటే అలాంటి ఎంపిక‌లు స్టోరీ డిమాండ్ చేస్తే త‌ప్ప తెర‌పై చూడ‌టం అన్న‌ది చాలా క‌ష్ట‌మైన ప‌ని. అభిమానులు కూడా అలాంటి కాంబినేష‌న్స్ ని అస్స‌లు యాక్స‌ప్ట్ చేయ‌రు. అందుకే హీరో వ‌య‌సు ఎంత ఉన్నా? హీరోయిన్ వ‌య‌సు మాత్రం 35 లోపు ఉండేలా చూసుకుంటారు మేక‌ర్స్.

ఈ కాంబినేష‌న్ లో రొమాన్స్ ని చూడ‌టానికి ప్రేక్ష‌కులు అంతే ఆస‌క్తి చూపిస్తారు. 52 ఏళ్ల వ‌య‌సున్న హీరోతో అదే వ‌య‌సున్న హీరోయిన్ రొమాన్స్ చేస్తే? ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ ఓ కోలీవుడ్ మేక‌ర్ మాత్రం ఈ సంచ‌ల‌నానికి తెర తీసిన‌ట్లు క‌నిపిస్తుంది. త‌ల అజిత్ 63వ చిత్రాన్ని అధిక్ ర‌విచంద్ర‌న్ తెర‌కె క్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ కాంబినేష‌న్ లో సినిమాని అధికారికంగా ప్ర‌క‌టించారు.

అయితే ఇందులో అజిత్ కి జోడీగా హీరోయిన్ గా సీనియ‌ర్ భామ ట‌బుని ఎంపిక చేసారు. దీంతో ఈ కాంబినేష‌న్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రు వ‌య‌సు ఒకేలా ఉండ‌ట‌మే మ‌రింత క్యూరియాసిటీని పెంచే స్తుంది. అజిత్ వ‌య‌సు 52 కాగా..ట‌బు వ‌య‌సు కూడా 52 కావ‌డం విశేషం. ఇలా ఇద్ద‌రి స‌రి స‌మాన వ‌య సులో ఓ సినిమా రావ‌డం ఇంట్రెస్టింగ్. మ‌రి అజిత్ కి జోడీగా అంత వ‌య‌సున్న ట‌బుని తీసుకోవ‌డం వెనుక మిస్ట‌రీ ఏంటి? అన్న‌ది తెలియాలి.

హీరోయిన్ పాత్ర అంత వ‌య‌సున్న న‌టిని డిమాండ్ చేయ‌డంతో? తీసుకున్నాడా? లేక ఇంకేదైనా కార‌ణం ఉందా? అన్న సంగ‌తి తెలియాలి. అజిత్-ట‌బు జోడీ కొత్తేం కాదు. ఇద్ద‌రు వ‌య‌సులో ఉండ‌గా 24 ఏళ్ల క్రితం` `ప్రియురాలు పిలిచింది` అనే సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ్యూజిక‌ల్ గా ఈ సినిమా ఓ పెద్ద సంచ‌లనం. ఇప్ప‌టికీ ఆ సినిమా పాట‌లు మారు మ్రోగుతూనే ఉన్నాయి.