Begin typing your search above and press return to search.

ఎక్క‌డ ఆగిందో మ‌ళ్లీ అక్క‌డి నుంచే!

తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎక్క‌డ ఆగిందో? అక్క‌డ నుంచే మొద‌లు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా అజిత్ చెన్నై ఎయిర్ పోర్టులో క‌నిపించారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:30 AM GMT
ఎక్క‌డ ఆగిందో మ‌ళ్లీ అక్క‌డి నుంచే!
X

త‌ల అజిత్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే కొత్త చిత్రం 'విడాముయ‌ర్చి' ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. మ‌గిళ్ తిరుమ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఒక్క‌సారిగా బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. అజ‌ర్ బైజాన్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా అసిస్టెంట్ కెమారా మ్యాన్ ప్రమాద‌వ‌శాత్తు మృతి చెంద‌డంతో చిత్రీక‌ర‌ణ నిలిపివేసారు.

అప్ప‌టి నుంచి యూనిట్ కొన్ని నెల‌లు పాటు షూట్ కి వెళ్ల‌లేదు. చెన్నైలో కూడా షూటింగ్ నిర్వ‌హిం చ‌లేదు. దీంతో ఈ సినిమాని తాత్కాలికంగా ప‌క్క‌ను పెట్టిన‌ట్లు వార్త‌లొచ్చాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎక్క‌డ ఆగిందో? అక్క‌డ నుంచే మొద‌లు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా అజిత్ చెన్నై ఎయిర్ పోర్టులో క‌నిపించారు. అజ‌ర్ బైజాన్ షూటింగ్ కి బ‌య‌ల్దేరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే యూనిట్ స‌భ్యులు స్పాట్ కి చేరుకుని షూటింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం.

దీనిలో భాగంగానే అజిత్ కూడా బ‌య‌ల్దేరిన‌ట్లు తెలుస్తోంది. అజ‌ర్ బైజాన్ షెడ్యూల్ మొత్తం పూర్తిచేసిన త‌ర్వాత చెన్నైలో కొత్త షెడ్యూల్ ప్రారంభించేలా చిత్ర‌బృందం చ‌ర్య‌లు తీసుకుంటోంది. వ‌చ్చే ఏడాది వేస‌విలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో ఇక‌పై గ్యాప్ లేకుండా షూటింగ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

అజిత్ ఈ సినిమాకి కేటాయించిన షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో! అద‌నంగా కేటాయిం చాల్సి వ‌స్తోందిట‌. ఈ తేడా కార‌ణంగా త‌దుప‌రి చిత్రాల షూటింగ్ కూడా ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోం ది. ఇప్ప‌టికే అజిత్ కు ప‌లువురు ద‌ర్శ‌కులు స్టోరీలు చెప్పి సిద్దంగా ఉన్నారు. 2025లో ఆ చిత్రాలు షూటింగ్ ప్రారంభిచాల‌ని రెడీ అవుతున్నారు.