Begin typing your search above and press return to search.

గుస‌గుస‌: లైకా ప్రొడ‌క్షన్స్‌తో త‌ళా అజిత్ క‌టీఫ్!

త‌ళా అజిత్ తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్రేక‌ప్ కానుందా? త‌దుపరి భారీ చిత్రం ప్రారంభంలోనే ఆగిపోయిందా?

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:24 AM GMT
గుస‌గుస‌: లైకా ప్రొడ‌క్షన్స్‌తో త‌ళా అజిత్ క‌టీఫ్!
X

త‌ళా అజిత్ తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్రేక‌ప్ కానుందా? త‌దుపరి భారీ చిత్రం ప్రారంభంలోనే ఆగిపోయిందా? అంటే అవున‌నే కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. తాజా గుస‌గుస‌ల ప్రకారం.. లైకా ప్రొడక్షన్స్ -అజిత్ కుమార్ మధ్య సమస్యలు త‌లెత్తాయి. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం నుండి తప్పుకునే అవకాశం ఉందని పుకార్లు రావ‌డం అబ్బుర‌ప‌రుస్తోంది.

అజిత్ తో 'విడాముయార్చి' ప్రాజెక్ట్ నుండి వైదొలగాలని ప్రొడక్షన్ హౌస్ లైకా ఆలోచిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో ప్రొడక్షన్ హౌస్ ఈ నిర్ణయం తీసుకుందని ప్ర‌చార‌మ‌వుతోంది. వచ్చే నెలలోగా చిత్రీకరణ ప్రారంభించకుంటే తాము ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతామ‌ని లైకా అజిత్ కి క్లియ‌ర్ క‌ట్ గా తేల్చిచెప్పింది. నిజానికి అజిత్ తో లైకాకు గొప్ప అనుబంధం ఉంది. ఇంతకుముందు అజిత్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం 'తునివు'ను కూడా నిర్మించింది. కానీ ఇంత‌లోనే పొర‌పొచ్చాలొచ్చాయి.

నిజానికి దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో అజిత్ కుమార్ సినిమాని లైకా సంస్థ తొలిగా ప్రకటించింది. కానీ నిర్మాతలు స్క్రిప్ట్ - కథాంశంతో సంతృప్తి చెందకపోవడంతో, దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. తరువాత ద‌ర్శ‌కుడు మగిజ్ తిరుమేని ఈ సినిమా చేస్తార‌ని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండ‌గా లైకా సంస్థ బ్రేక‌ప్ కి సిద్ధ‌మ‌వుతోంద‌ని ఖ‌రారైంది.

విదాముయార్చి గురించి అధికారిక ప్రకటన మినహా ఇప్ప‌టివ‌ర‌కూ తారాగణం సిబ్బందికి సంబంధించిన ఇతర వివరాలు రివీల్ కాలేదు. కథానాయికగా త్రిష కృష్ణన్‌ని ఎంపిక చేసినట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ - త్రిష జోడీ జి- కిరీడం-మంకథా- యెన్నై అరిందాల్ చిత్రాలలో క‌లిసి పనిచేశారు. త్రిష కృష్ణన్ విడముయార్చిలో ఖాయ‌మైతే ఇది అజిత్-త్రిష జంట‌కు 5వ సినిమా అవుతుంది. ఈ చిత్రం భారీ యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండ‌గా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిచ‌నున్నారు.