Begin typing your search above and press return to search.

హాస్పిటల్ లో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కంగారు..!

సడెన్ గా హాస్పిటల్ కి వెళ్లడంపై అజిత్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయనకు ఏమైందో అన్న కంగారులో ఉన్నారు. ఆయన రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   7 March 2024 7:46 AM GMT
హాస్పిటల్ లో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కంగారు..!
X

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరడంతో తల ఫ్యాన్స్ అంతా కూడా కంగారు పడుతున్నారు. అజిత్ కి ఏమైంది.. ఆయన ఎందుకు హాస్పిటల్ లో చేరారని ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. అజిత్ హాస్పిటల్ లో చేరిన విషయంపై ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో అజిత్ చేరినట్టుగా తెలుస్తుంది. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే అజిత్ హాస్పిటల్ కి వచ్చినట్టు సమాచారం. సడెన్ గా హాస్పిటల్ కి వెళ్లడంపై అజిత్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయనకు ఏమైందో అన్న కంగారులో ఉన్నారు. ఆయన రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లారని తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ తన సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. కేవలం స్టార్ హీరో గానే కాదు రేసర్ గా కూడా ఆయన ప్రత్యేకత చాటారు. అజిత్ కి బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే సరదాగా అలా దేశం మొత్తం బైక్ మీద తిరుగుతుంటారు. అజిత్ కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో భారీ యాక్సిడెంట్ వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.

రీ ఎంట్రీ తర్వాత ఆయన ఫ్యాన్స్ ని అలరించే సినిమాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు అజిత్. ఇండియన్ సినిమా మీద ఇదివరకు ఎప్పుడు చూడని యాక్షన్ ఘట్టాలు.. రియలిస్టిక్ స్టంట్స్ ని చూపించాలని అజిత్ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అజిత్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటారు.

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ తునివు సినిమాతో ఫ్యాన్స్ ని అలరించిన అజిత్ ప్రస్తుతం విదా ముయార్చి సినిమా చేస్తున్నారు. తమిళ హీరోనే అయినా తెలుగులో కూడా అజిత్ కు సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఇక్కడ ఆడియన్స్ ని అలరిస్తుంటారు. కోలీవుడ్ లో రజిని, విజయ్ తర్వాత అంతే భారీ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో అజిత్ ఒకరు.