Begin typing your search above and press return to search.

42కేజీలు త‌గ్గ‌డానికి త‌ళా క‌ఠోర త‌ప‌స్సు

భార‌త‌దేశంలోని ఏ ఇత‌ర స్టార్ చేయ‌లేని విధంగా మోటార్ కార్ రేసింగ్‌లో అత‌డు స‌త్తా చాటుతున్నాడు

By:  Tupaki Desk   |   17 May 2025 9:28 AM IST
Discipline, Diet, and Drive: How Ajith Lost 42 Kg for His Racing Dream
X

త‌ళా అజిత్ ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు కార్ రేసింగుల‌తో బిజీ బిజీగా ఉన్నారు. భార‌త‌దేశంలోని ఏ ఇత‌ర స్టార్ చేయ‌లేని విధంగా మోటార్ కార్ రేసింగ్‌లో అత‌డు స‌త్తా చాటుతున్నాడు. స్పోర్ట్స్ హ్యాబిట్ కోసం, త‌న అభిరుచిని నెర‌వేర్చుకోవ‌డం కోసం సినిమాల‌కు బ్రేక్ నిస్తూ, కోట్లాది రూపాయ‌ల ఆదాయానికి గండి ప‌డుతున్నా, అత‌డు రేసింగుల్లో ముందుకు సాగుతూనే ఉన్నాడు.

ఆస‌క్తిక‌రంగా అదే రేసింగ్ అత‌డి జీవితాన్ని కీల‌క మ‌లుపు తిప్పింది. అత‌డు త‌న ఆట కోసం క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌రుచుకున్నాన‌ని చెప్పాడు. ఫిట్ గా ఉంటేనే రేసింగ్ లో దూసుకెళ్ల‌గ‌ల‌రు. ఆత్మ - మ‌న‌సు క‌లిసి ప‌ని చేస్తేనే హైస్పీడ్ రేసింగుల్లో నెగ్గ‌గ‌ల‌మ‌ని భావించిన అజిత్ త‌న జీవ‌న‌శైలిని అమాంతం మార్చేసాడు. ఆల్క‌హాల్ మానేసాడు. సిగ‌రెట్లు తాగ‌డం మానేశాడు. స‌మ‌యానికి నిద్ర పోవ‌డం, మాంసాహారం మానేసి శాఖాహారం తిన‌డం మొద‌లు పెట్టాడు. అంతేకాదు త‌న రోజు వారీ వ్యాయామాల్లో సైక్లింగ్, ఈత కొట్ట‌డం వంటివి త‌న బ‌రువును తగ్గించేందుకు ఎంత‌గానో స‌హ‌క‌రించాయ‌ని తెలిపాడు.

త‌న జీవన శైలిని మార్చుకోవ‌డం ద్వారా 2024 ఆగ‌స్టు నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 42 కిలోల బ‌రువు త‌గ్గిపోయాన‌ని అజిత్ చెప్పాడు. ఇది అద్భుత‌మైన ప‌రివ‌ర్త‌న‌. ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త‌ళా అజిత్ కుమార్ తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి మాట్లాడారు. ఇటీవ‌ల గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో స‌క్సెస్ అందుకున్న జోష్ లో కొత్త సినిమాని కూడా ప్ర‌క‌టించాడు. అజిత్ సినిమాల నుంచి విర‌మిస్తున్నార‌న్న ప్ర‌చారానికి ఆయ‌న చెక్ పెట్టారు. న‌వంబ‌ర్ నుంచి త‌దుప‌రి సినిమా షూటింగుకు వెళ‌తాన‌ని తెలిపాడు. ఈ ఏడాది అజిత్ గుడ్ టైమ్ ర‌న్ అవుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించిన సంగ‌తి తెలిసిందే.