Begin typing your search above and press return to search.

అజిత్‌ సర్‌ప్రైజింగ్‌ టాటూ.. ఫ్యాన్స్ షాక్‌

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నాడంటే విడుదల వరకు ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు.

By:  Tupaki Desk   |   26 Oct 2025 1:00 AM IST
అజిత్‌ సర్‌ప్రైజింగ్‌ టాటూ.. ఫ్యాన్స్ షాక్‌
X

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నాడంటే విడుదల వరకు ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. విడుదల సమయంలో అజిత్‌ కనీసం మీడియా ముందుకు వచ్చి ఒక్క మాట మాట్లాడకున్నా సినిమాను అభిమానులు స్వయంగా నెత్తిన పెట్టుకుని మరీ ప్రమోషన్ చేయడం మనం చాలా సార్లు చూశాం. అలాంటి అజిత్‌ సినిమాలు కోలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించడం మనం చూశాం. అంతే కాకుండా తెలుగులోనూ అజిత్‌ సినిమాలకు మంచి బజ్‌ ఉంటుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో అజిత్‌ సినిమాలు ఆడటం లేదు కానీ ఒకప్పుడు అజిత్‌ సినిమాలు కోలీవుడ్‌లో ఏ స్థాయిలో ఆడేవో అదే స్థాయిలో తెలుగు లోనూ మంచి వసూళ్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం తెలుగులో ఆయన మార్కెట్ తగ్గిందని చెప్పాలి.

సోషల్‌ మీడియాలో అజిత్‌ ఫ్యాన్స్‌...

అజిత్‌ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఒక విషయం గురించి ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. అజిత్‌ రేసింగ్‌లకు సంబంధించిన వీడియోలు, యాక్షన్ స్టంట్స్‌కి సంబంధించిన వీడియోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ చేస్తూ ఉంటారు. అజిత్ సాధారణంగా సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు. అయితే ఆయన భార్య షాలిని మాత్రం రెగ్యులర్‌గా తమ రొటీన్‌ లైఫ్‌ కి సంబంధించిన విషయాలు, ప్రత్యేక సందర్భాల గురించి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఒక హిందూ దేవాలయం సందర్శనకు వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటోను షాలిని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంది. ఆ ఫోటోలో సర్‌ప్రైజింగ్‌గా అజిత్‌ షర్ట్‌ లేకుండా, కేవలం టవల్‌ ధరించి కనిపించాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాను తెగ షేక్ చేస్తూ వైరల్‌ అవుతున్నాయి.

హిందూ దేవత టాటూతో అజిత్‌

సాధారణంగానే అజిత్‌ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ సారి అజిత్‌ షర్ట్‌ లేకుండా ఉండటం, పైగా ఒక హిందూ దేవత టాటూ తన చెస్ట్‌ భాగంలో వేయించుకుని కనిపించడంతో ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నాయి. అజిత్ నుంచి ఇలాంటి ఒక టాటూను ఊహించలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అజిత్ ఇన్నాళ్లు ఈ టాటూను దాచారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం అజిత్‌ కి హిందూ దేవుళ్లపై ఉన్న అభిమానం, భక్తికి ఇది నిదర్శనం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మొత్తానికి అజిత్‌ వేసుకున్న టాటూ గురించి, ఆయన దర్శించుకున్న దేవాలయం గురించి సోషల్‌ మీడియా ద్వారా తెగ చర్చ జరుగుతోంది. అజిత్ ఒంటి మీద ఉన్న ఆ టాటూ హిందూ దేవత ఎవరు అంటూ ఏకంగా ఏఐ ని నెటిజన్స్ ప్రశ్నిస్తూ సమాధానం తెలుసుకునేందుకు తెగ కష్టపడుతున్నారు.

గుడ్ బ్యాడ్‌ అగ్లీ సినిమాతో

ఇక అజిత్‌ సినిమాల విషయానికి వస్తే తెలుగు నిర్మాణ సంస్థ నిర్మించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాతో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పటిలాగే తమిళ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా తెలుగులో మాత్రం మినిమం ఓపెనింగ్స్‌ను నమోదు చేయలేదు. అంతకు ముందు వచ్చిన సినిమా కూడా తెలుగులో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. హీరోగా అజిత్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక వైపు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే మరో వైపు అజిత్‌ తన రేసింగ్‌ ఫ్యాషన్‌ను వీడకుండా రేస్‌ టోర్నమెంట్స్‌లో పాల్గొంటున్నాడు. ఇటీవల అజిత్‌ ఆధ్వర్యంలో ఒక రేసింగ్‌ టీం ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో అజిత్‌ నడుపుతున్న కారు క్రాష్ కావడం, స్వల్ప గాయాలు కావడం కూడా తెలిసిందే.